2022 Tollywood Report: ఈ ఏడాది ప్రథమార్థంలో తెలుగు సినీ రంగానికి కాలం కలిసి రాలేదు. ఆరు మాసాలు గడిచిపోయినా, ఒకటి రెండు తప్ప పెద్దగా పర్‌ఫెక్ట్ హిట్స్ పడలేదు. ఐతే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. అలాగే, ‘భీమ్లా నాయక్’ సినిమా హిట్ తో పవన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ, ఓవరాల్ గా టాలీవుడ్ పరిస్థితి ఏ మాత్రం మారలేదు. టాలీవుడ్ గతంలో ఎలా ఉందో.. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు అలాగే నడిచింది. సక్సెస్ రేటు కాస్త పెరిగినప్పటికీ… ఓవరాల్ గా ఇండస్ట్రీ లాభపడిన దాఖలాలు కనిపించలేదు. మొత్తమ్మీద ఒకటీ అరా విజయాలతో ఈ ఆరు నెలల కాలం చూస్తుండగానే గడిచిపోయింది.
2022 జనవరిలో విడుదలైన 11 చిత్రాల్లో ఒక్క ‘బంగార్రాజు’ తప్ప, ఇక ఏ చిత్రం విజయం సాధించలేదు. గుడ్ లక్ సఖి, హీరో, సూపర్ మచ్చి, రౌడీ బాయ్స్, అతిథి దేవో భవ, వేయి శుభములు కలుగు నీకు, 1945, ఇందువదన, ఆశ ఎన్కౌంటర్ వంటి మిగిలిన 10 సినిమాలు ప్లాప్ చిత్రాలుగా నిలిచాయి. అంటే.. జనవరి సక్సెస్ రేటు 10 % కూడా లేదు.
2022 ఫిబ్రవరిలో విడుదలైన 10 చిత్రాల్లో భీమ్లా నాయక్, డీజే టిల్లు తప్ప, మరో ఏ చిత్రం విజయం సాధించలేదు. వలిమై, వర్జిన్ స్టోరి, సన్ ఆఫ్ ఇండియా, సెహరి, ఖిలాడి, మళ్లీ మొదలైంది, ఫైర్, భామా కలాపం.. ఇలా 9 సినిమాలు ప్లాప్ చిత్రాలుగా నిలిచాయి. అంటే ఫిబ్రవరి కూడా నష్టాలమయమే. ముఖ్యంగా మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా అవమానకరంగా పరాజయం పాలైంది.
2022 మార్చిలో విడుదలైన 10 చిత్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ తప్ప, ఏ చిత్రం విజయం సాధించలేదు. స్టాండప్ రాహుల్, నల్లమల, జేమ్స్, క్లాప్, రాధే శ్యామ్, మారన్, నాతిచరామి, ఈటి-ఎవరికీ తలవంచడు, సెబాస్టియన్ పిసి524 ఇలా 9 సినిమాలు ప్లాప్ చిత్రాలుగా నిలిచాయి. ఐతే, ఆర్ఆర్ఆర్ రికార్డు కలెక్షన్స్.. తెలుగు బాక్సాఫీస్ కి భారీ ఊపు తెచ్చాయి.
2022 ఏప్రిల్ విషయానికి వస్తే.. ఆచార్య, కణ్మణి రాంబో ఖతీజా, 1996 ధర్మపురి, కేజీఎఫ్ చాప్టర్ 2, బీస్ట్, గని, రెడ్డిగారింట్లో రౌడీయిజం, మిషన్ ఇంపాజిబుల్. వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ‘ఆచార్య’ బాగా నిరాశ పరిస్తే.. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మాత్రం సరికొత్త రికార్డులు నమోదు చేసింది. దాంతో ఏప్రిల్ నెలలో బాక్సాఫీస్ దగ్గర బాగానే హడావుడి కనిపించింది.
ఇక మే నెలలో విడుదలైన సినిమాల జాబితా కూడా భారీగానే ఉంది. ఐతే, ఒక్క ‘సర్కారు వారి పాట’ మాత్రమే కలెక్షన్స్ ను రాబట్టింది. అలాగే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ కూడా ఏవరేజ్ హిట్ ను అందుకుంది. ఇక మిగిలిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. ఈ సినిమాల లిస్ట్ లో బ్లాక్, ఎఫ్ 3, శేఖర్, డేగల బాబ్జి, ధగడ్ సాంబ, జయమ్మ పంచాయతీ, భళా తందనాన వంటి సినిమాలు ఉన్నాయి.
అదేవిధంగా జూన్ లో ఇప్పటికే 14 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో మేజర్, విక్రమ్ సినిమాలు మాత్రమే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మిగిలిన సినిమాలన్నీ ప్లాపే. ఈ సినిమాల లిస్ట్ లో ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు, 7 డేస్ 6 నైట్స్, సమ్మతమే, చోర్ బజార్, సదా నన్ను నడిపే, కొండా, విరాట పర్వం, గాడ్సే, కిరోసిన్, 777 చార్లీ, కిన్నెరసాని, అంటే సుందరానికి’ వంటి సినిమాలు ఉన్నాయి. మొత్తంగా ఈ ఏడాది ప్రదమార్ధంలో వికసించిన సినీ కుసుమాల కంటే నేలరాలిన పువ్వులే ఎక్కువగా ఉన్నాయి.
Also Read:Nidhhi Agerwal: 60 ఏళ్ల హీరోలకు 28 ఏళ్ళ హీరోయిన్ సై అంటుంది