TDP Politics on Mega Family : మెగా ఫ్యామిలీపై టీడీపీ కుట్ర!

TDP Politics on Mega Family టీడీపీ లాబీ మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోందని అనిపిస్తోంది. ఇటీవల ఒక న్యూస్ చానెల్ డిబేట్ లో జరిగిన చర్చ చూస్తుంటే.. టీడీపీ అనుకూల మేధావులు.. చంద్రబాబు కనుసన్నల్లో నడిచేవారు ఆ ఇద్దరు మాట్లాడింది చూస్తుంటే.. ఇదొక కుట్ర జరుగుతోందని అనిపిస్తోంది. చంద్రబాబు మనుసులో మాట వీళ్లతోనే చెప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కుటుంబంలో కూడా చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేసి విడదీసిన చరిత్ర ఆయన సొంతం. ఇప్పుడు […]

Written By: NARESH, Updated On : June 21, 2022 9:16 am
Follow us on

TDP Politics on Mega Family టీడీపీ లాబీ మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోందని అనిపిస్తోంది. ఇటీవల ఒక న్యూస్ చానెల్ డిబేట్ లో జరిగిన చర్చ చూస్తుంటే.. టీడీపీ అనుకూల మేధావులు.. చంద్రబాబు కనుసన్నల్లో నడిచేవారు ఆ ఇద్దరు మాట్లాడింది చూస్తుంటే.. ఇదొక కుట్ర జరుగుతోందని అనిపిస్తోంది. చంద్రబాబు మనుసులో మాట వీళ్లతోనే చెప్పిస్తున్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ కుటుంబంలో కూడా చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేసి విడదీసిన చరిత్ర ఆయన సొంతం. ఇప్పుడు మెగా ఫ్యామిలీపై కూడా చంద్రబాబు ఇలాంటి కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా చిరంజీవిని పైకి లేపి.. పవన్ కళ్యాణ్ ను కిందకు దింపే కుట్రకు చంద్రబాబు తెరతీసినట్టు కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి.. ఆయనకు క్లారిటీ లేదు.. నిలకడ లేదని ప్రకటించడం ఈ కుట్రకు కారణం. ఇటీవల విజయవాడలో జరిగిన మెగాఫ్యాన్స్ అభిమానుల సంఘం ఐక్యంగా జనసేనకు సపోర్ట్ ప్రకటించడంతో టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ ను లైట్ తీసుకొని ఓ 20 లేదా 30 సీట్లు ఇస్తే జనసేనకు సరిపోతుందని భావించారు. కానీ ఇప్పుడు జనంతోనే జనసేన పొత్తు అని పవన్ ప్రకటించడంతో టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అందుకే ఇప్పుడు మెగా ఫ్యామిలీపై టీడీపీ కుట్రలు చేస్తోంది? ఆ కుట్రలు ఏంటి? పవన్ ను ఎలా అణగదొక్కాలనుకుంటున్నారనే దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.