Analysis on Punjab Model పంజాబ్ లో జరిగిన పరిణామం ప్రజలందరికీ కూడా ఆదర్శవంతం కావాలి. పంజాబ్ మోడల్.. దేశానికి రోల్ మోడల్ కావాలి. అవినీతిపై యుద్ధం.. అరవింద్ కేజ్రీవాల్ అస్త్రం. దాన్ని అక్షరాల చేసి చూపిస్తున్నారు కేజ్రీవాల్.
దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రం పంజాబ్. పైగా డ్రగ్స్ సమస్య ఇక్కడ చాలా ఎక్కువ. అత్యధిక మరణాల రేటులో పంజాబ్ యే మొదటి స్థానంలో ఉంది. వ్యవసాయ సంక్షోభం సహా ఎన్నో సమస్యలున్నాయి.
పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వచ్చాక వరి విత్తనాలను నేరుగా వేస్తే రూ.1500 ఇస్తామని ప్రకటించింది. నారుమడులు పెరిగాక నాటడం కన్నా.. ముందే డైరెక్ట్ గా నాటే ఆధునిక వరి పద్ధతులను అమలు చేస్తోంది. అలాగే మినప పంటకు కనీస మద్దతుధరను ప్రకటించింది. పంట మార్పిడికి ప్రోత్సహకాలు ప్రకటించింది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్.. ఏకంగా అవినీతి మంత్రిని తొలగించారు. టీవీల్లో ఆ మంత్రిపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. లేక ప్రతిపక్షాల ఆరోపణలకు తొలగించలేదు. ముఖ్యమంత్రియే స్వయంగా నిఘా పెట్టి ఆడియో రికార్డులు సేకరించి.. అనంతరం మంత్రిని స్వయంగా పిలిచి అవినీతిపై అడిగారు. 1 శాతం లంచం తీసుకున్నట్టు ఒప్పుకోవడంతో పంజాబ్ సీఎం ఏకంగా మంత్రిపై వేటు వేశారు.
పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉండి లంచం తీసుకున్నందుకు ఏకంగా పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ భర్తరఫ్ చేయడం దేశ రాజకీయాల్లో సంచలనమైంది. ఈ పంజాబ్ మోడల్ దేశానికి రోల్ మోడల్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.