Analysis On North East India (Part 4) Statistics : ఈశాన్య భారతంలో మోడీ వచ్చాక అభివృద్ధి ఏంటి? అసలు మార్పులేమిటీ? మోడీ ఏ విధంగా ప్రజలను తన అభివృద్ధి మంత్రంతో ఆకట్టుకోగలిగాడు.. ఉగ్రవాద వైఖరి ఏ విధంగా తగ్గటానికి కారణభూతమైంది? ఈశాన్య భారతం లో అసలు మోడీ ఏం చేశాడన్న దానిపై ఈ 4వ భాగంలో తెలుసుకుందాం..
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మోడీ ప్రధాని అయ్యాక.. వెనుకబడ్డ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు పెద్దపీట వేశాడు. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి నిధులు ఇచ్చి, ప్రణాళికలు వేసి వేగవంతంగా చేస్తూ అక్కడి ప్రజలను అక్కున చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈశాన్య ప్రాంత గ్యాస్ గ్రిడ్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఈశాన్య భారత దశ,దిశ మారబోతోంది..
ఈశాన్య భారతం.. దురదృష్టవశాత్తు భారత్ లోని మిగతా రాష్ట్రాల వారికీ దీని గురించి పెద్దగా అవగాహన లేదు. మోడీ ప్రభుత్వం వచ్చాక ఈశాన్య భారతానికి పెద్దపీట వేశారు. దాన్ని అభివృద్ధి చేశారు. ఈశాన్య భారతాన్ని భారత్ తో మమేకం చేశారు. మోడీ అతిపెద్ద గొప్ప కార్యం ఏంటంటే ఈశాన్య భారతానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత.
ఈశాన్య భారతంలో మోడీ చేసిన అభివృద్ధి , మార్పులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో తెలుసుకుందాం..