North East India : మన దేశ రాజకీయం అంతా హిందీ ప్రాబల్యమున్న ఉత్తరాది చుట్టే తిరుగుతుంది. అభివృద్ధి కోణంలో చూస్తే దక్షిణ భారతదేశం ముందంజలో ఉంటుంది. ఇక ఎప్పుడూ అల్లకల్లోలంగా కశ్మీర్ ఉంటుంది. ఈశాన్య భారతంలో వెనుకబడ్డామన్న ఫీలింగ్ అక్కడి ప్రజల్లో ఉంటుంది. అందుకే కశ్మీర్, ఈశాన్య భారతంలో వేర్పాటువాద ఉద్యమాలు కొనసాగుతున్నాయి. తరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు వీటిని పట్టించుకోలేదు.
కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మోడీ ప్రధాని అయ్యాక.. వెనుకబడ్డ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు పెద్దపీట వేశాడు. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి నిధులు ఇచ్చి, ప్రణాళికలు వేసి వేగవంతంగా చేస్తూ అక్కడి ప్రజలను అక్కున చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈశాన్య ప్రాంత గ్యాస్ గ్రిడ్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఈశాన్య భారత దశ,దిశ మారబోతోంది..
ఈశాన్య భారతం.. దురదృష్టవశాత్తు భారత్ లోని మిగతా రాష్ట్రాల వారికీ దీని గురించి పెద్దగా అవగాహన లేదు. మోడీ ప్రభుత్వం వచ్చాక ఈశాన్య భారతానికి పెద్దపీట వేశారు. దాన్ని అభివృద్ధి చేశారు. ఈశాన్య భారతాన్ని భారత్ తో మమేకం చేశారు. మోడీ అతిపెద్ద గొప్ప కార్యం ఏంటంటే ఈశాన్య భారతానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత. దాని గురించి ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో తెలుసుకుందాం..