https://oktelugu.com/

KCR Politics : అధికారం చుట్టూ కేసీఆర్ రాజకీయం

KCR Politics : కేసీఆర్ ది సిద్ధాంత రాజకీయం అనుకుంటే పొరపాటే. ఎప్పుడూ కేసీఆర్ ది అవకాశవాద.. అధికారం కోసం చేసే రాజకీయమే.. అలాంటి అవకాశ వాద కేసీఆర్ తో కమ్యూనిస్టులు భజన చేయడమే అందరికీ విస్తుగొలుపుతోంది. మొదటి నుంచి ప్రతిపక్షాలందరూ మోడీని వ్యతిరేకించిన రోజు ఇదే కేసీఆర్ మద్దతిచ్చాడు. ఎందుకంటే 2014లో కేసీఆర్ కు సవాల్ విసిరింది ఆ నాడు కాంగ్రెస్. నాడు మోడీ మంచివాడయ్యాడు. ఇప్పుడు మోడీ వ్యతిరేకిగా కేసీఆర్ ఫోకస్ అవుతున్నాడు. ఇప్పుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2022 / 09:22 PM IST
    Follow us on

    KCR Politics : కేసీఆర్ ది సిద్ధాంత రాజకీయం అనుకుంటే పొరపాటే. ఎప్పుడూ కేసీఆర్ ది అవకాశవాద.. అధికారం కోసం చేసే రాజకీయమే.. అలాంటి అవకాశ వాద కేసీఆర్ తో కమ్యూనిస్టులు భజన చేయడమే అందరికీ విస్తుగొలుపుతోంది. మొదటి నుంచి ప్రతిపక్షాలందరూ మోడీని వ్యతిరేకించిన రోజు ఇదే కేసీఆర్ మద్దతిచ్చాడు. ఎందుకంటే 2014లో కేసీఆర్ కు సవాల్ విసిరింది ఆ నాడు కాంగ్రెస్. నాడు మోడీ మంచివాడయ్యాడు. ఇప్పుడు మోడీ వ్యతిరేకిగా కేసీఆర్ ఫోకస్ అవుతున్నాడు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ అధికారాన్ని సవాల్ చేసే స్థాయికి బీజేపీ ఎదగడంతో మోడీ పొడగిట్టడం లేదు. అసలు కారణం ఇదే..

    ఆరోజు 2014లో కేసీఆర్ కు పోటీగా కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు బీజేపీ పోటీ ఉండడంతో ఈ పార్టీపై పోరాడుతున్నారు. మున్ముందు కాంగ్రెస్ తో కలిసే అవకాశాలే కేసీఆర్ కు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ తగ్గితే కాంగ్రెస్ ను కలుపుకోవడానికి కూడా కేసీఆర్ వెనుకాడరు.

    ఇందులో సిద్ధాంతం ఏమీ లేదు.. అవకాశం కోసం కేసీఆర్ రాజకీయం చేస్తున్నారు. మరి కమ్యూనిస్టులకు కేసీఆర్ లో సిద్ధాంతం ఎక్కడ కనపడిందన్నది ప్రశ్న. మోడీని వ్యతిరేకించే కేసీఆర్ లో ఏం చూసి మద్దతిచ్చారన్నది ఇక్కడ అందరూ అడుగుతున్న ప్రశ్న. కేసీఆర్ రాజకీయాలు.. కమ్యూనిస్టుల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.