KCR National Party : కొత్త పార్టీ పెట్టాలంటే కేసీఆర్ ఏమి చేయాలి?

Analysis on KCR National Party కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేశాడు.. ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి నిచ్చెన వేసినట్టుంది కేసీఆర్ పరిస్థితి. తెలంగాణ విడిపోయినప్పుడు మిగులు బడ్జెట్, హైదరాబాద్ లాంటి మహానగరాన్ని కేసీఆర్ చేతుల్లో పెట్టారు. నగరం నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణ మొత్తాన్ని పోషించేలా ఉంది. ఐటీ, ఫార్మా రంగం నుంచే అధిక ఆదాయం వస్తోంది. కేసీఆర్ చేతుల్లోకి అప్పజెప్పడానికి ముందు ఇది రెవెన్యూ మిగులు రాష్ట్రం. అయితే కేసీఆర్ పాలన 8 ఏళ్లు గడిచేసరికి […]

Written By: NARESH, Updated On : October 6, 2022 4:20 pm
Follow us on

Analysis on KCR National Party కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేశాడు.. ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి నిచ్చెన వేసినట్టుంది కేసీఆర్ పరిస్థితి. తెలంగాణ విడిపోయినప్పుడు మిగులు బడ్జెట్, హైదరాబాద్ లాంటి మహానగరాన్ని కేసీఆర్ చేతుల్లో పెట్టారు. నగరం నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణ మొత్తాన్ని పోషించేలా ఉంది. ఐటీ, ఫార్మా రంగం నుంచే అధిక ఆదాయం వస్తోంది.

కేసీఆర్ చేతుల్లోకి అప్పజెప్పడానికి ముందు ఇది రెవెన్యూ మిగులు రాష్ట్రం. అయితే కేసీఆర్ పాలన 8 ఏళ్లు గడిచేసరికి కేసీఆర్ చేసిందేమిటి? గుడులు, సచివాలయం లాంటి భవనాలకు వేల కోట్లు ఖర్చు పెట్టారు. ప్రగతిభవన్ ను కట్టుకోవడానికి వెచ్చించారు. ప్రతీ కులానికి ఒక భవనం.. ఇలా కోట్లను వృథా చేశారు.

తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కేసీఆర్ వినియోగించుకోలేదు. అట్టర్ ఫ్లాప్ అయ్యాడనే చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా జాతీయ పార్టీ పెట్టేముందు పక్కనున్న ఆంధ్రా గురించి కూడా ఆలోచించలేదు కేసీఆర్. తోటి తెలుగు రాష్ట్రంతోనే సంబంధాలు నెరుపుకోని కేసీఆర్ జాతీయ స్థాయిలో ఎలా ఎదుగుతాడన్నది ఇక్కడ ప్రశ్న. కూర్చొని సమస్యలు పరిష్కరించుకునే సామర్థ్యం ఉన్నా కేసీఆర్ పక్క రాష్ట్రంతో గిచ్చి కయ్యాలు పెట్టుకుంటున్నాడు.

ఆంధ్రాకెళ్లి ఏ విధంగా కేసీఆర్ ఓట్లు అడుగుతారు? ఆంధ్రాలో అసలు కేసీఆర్ లాంటి విభజన, విద్వేష వాదికి ఏ ఒక్క ఆంధ్రుడు ఓటు వేయడు. ఏపీలో కేసీఆర్ పార్టీ పోటీచేస్తే కనీసం డిపాజిట్లు కూడా రావు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ పెట్టిన కేసీఆర్ ఏమి చేయాలన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింద చూడొచ్చు.