https://oktelugu.com/

Analysis on KCR Comments : రాజ్యాంగం మార్చండి కేసీఆర్ గారూ.. కానీ..!

Analysis on KCR Comments : తెలంగాణ సీఎం కేసీఆర్ బడ్జెట్ పై తన అభిప్రాయాన్ని నిన్న కుండబద్దలు కొట్టారు. అయితే అది బడ్జెట్ పై మాట్లాడినట్టు కాకుండా.. రాజకీయంగా విమర్శలకు వాడుకున్నారు. బడ్జెట్ ను స్టడీ చేసి.. అందులో లోటుపాట్లు ఏంటి? అందులో రాష్ట్రాలకు వచ్చిన మంచి ఏంటి? చెడు ఏంటీ? అన్నది మాట్లాడినట్టుగా లేదు. బడ్జెట్ పై అవగాహన ఉన్న వాళ్లకు కేసీఆర్ అస్సలు ఆ కోణంలో మాట్లాడలేదంటున్నారు. రాష్ట్రాలు ఎప్పటి నుంచో ఎఫ్ఆర్బీఎం […]

Written By:
  • NARESH
  • , Updated On : February 2, 2022 / 08:53 PM IST
    Follow us on

    Analysis on KCR Comments : తెలంగాణ సీఎం కేసీఆర్ బడ్జెట్ పై తన అభిప్రాయాన్ని నిన్న కుండబద్దలు కొట్టారు. అయితే అది బడ్జెట్ పై మాట్లాడినట్టు కాకుండా.. రాజకీయంగా విమర్శలకు వాడుకున్నారు. బడ్జెట్ ను స్టడీ చేసి.. అందులో లోటుపాట్లు ఏంటి? అందులో రాష్ట్రాలకు వచ్చిన మంచి ఏంటి? చెడు ఏంటీ? అన్నది మాట్లాడినట్టుగా లేదు.

    బడ్జెట్ పై అవగాహన ఉన్న వాళ్లకు కేసీఆర్ అస్సలు ఆ కోణంలో మాట్లాడలేదంటున్నారు. రాష్ట్రాలు ఎప్పటి నుంచో ఎఫ్ఆర్బీఎం పెంచాలని కోరుతున్నాయి. తాజాగా దాన్ని 4శాతానికి ఫైనాన్స్ కమిషన్ చేసింది. కానీ రాష్ట్రాలు మాత్రం మాకు వెసులుబాటు కావాలని.. దీన్ని పెంచాలని కోరుతున్నాయి. ఈ బడ్జెట్ లో ఎప్పుడూ లేని విధంగా వచ్చే సంవత్సరం లక్ష కోట్ల రూపాయల రుణం రాష్ట్రాలకు ఎలాంటి వడ్డీలు లేకుండా కేటాయించబోతోంది. కేంద్రం చేసిన ఈ నిర్ణయాన్ని ఏ రాష్ట్రం ఆహ్వానించలేదు.

    బడ్జెట్ పై అత్యంత ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాలకు కేంద్రం పెద్దపీట వేసినదాంట్లో ఇది కీలకమైంది. రాష్ట్రాలకు 16 లక్షల కోట్లు కేంద్రం ఇస్తే.. రాష్ట్రాలు కేంద్రానికి ఇచ్చేది 8 లక్షల కోట్లే.

    డా.అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇప్పుడు పనికిరాదన్న కేసీఆర్ వ్యాఖ్యలు సమంజసమేనా? రాష్ట్రాల హక్కులు హరించడమే కేంద్రం చేస్తున్న తప్పా? నదులు అనుసంధానం చేస్తాన్న కేంద్రం తీరు సరైందేనా? రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి. కేసీఆర్ వాదన సరైందేనా? అన్న దానిపై ‘రామ్’ వ్యూ పాయింట్ స్పెషల్ వీడియోను కింద చూడొచ్చు.