Analysis on Karthika Vanabhojanalu : స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయ్యింది. ఇన్నేళ్ల సమయం ఏ అంశానికి అయినా సమీక్షకు సరైన సమయం. అంబేద్కర్ చెప్పిన కుల నిర్మూలన సాధ్యమైందా? కులాల కుంపటి చల్లారిందా? కులాల కుంపటి పెరిగిందా? గుండెల మీద చేయి వేసుకొని ఎవరైనా చెప్పండి. కానీ ఇప్పటికీ సమాజంలో కులజాఢ్యం బాగా పెరిగింది. ఒకనాడు అగ్రకులాల వారికే ఈ కుల పట్టింపులు ఉండేవి. కానీ ఈనాడు ప్రతీ కులానికి పాకాయి.
ఏదైతే కుల నిర్మూలన చేయాలని అంబేద్కర్ చెప్పాడో.. అది ఈరోజుకు సాధ్యపడలేదంటే అతిశయోక్తి కాదు. ఆచరణలో సాధ్యం కాలేదన్నది నిజం. కులం అనేది ఇప్పుడొక వాస్తవంగా మారింది. విస్మరించలేని పరిస్థితి.
శ్రీశైలం వెళితే ఏదో ఒక కుల సంఘం భవనంలో ఉండాలి. అప్పట్లో శ్రీశైలంలో వసతులు లేనప్పుడు కులభవనాలే దిక్కయ్యేవి. నెలరోజులుగా జరుగుతున్న కార్తీక వనభోజనాల్లో కులజాఢ్యం వెల్లివిరిసింది. ఏ కులపోళ్లు ఆ కులపోళ్లతోనే వనభోజనాలు చేయడం విస్తుగొలిపింది. కార్తీక వనభోజనాల్లో వెల్లివిరిసిన కుల చైతన్యంపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.