Karnataka Minister Eshwarappa : కర్ణాటక అవినీతితో కుళ్లి కంపు కడుతోంది. కర్ణాటకలో అవినీతి వ్యవహారాలు కొత్తేమీ కాదు.. గాలి జనార్ధన్ రెడ్డి, యడ్యూరప్పలు ఇప్పటికే అవినీతి ఆరోపణలతో పదవులు కోల్పోయారు. ఇక ఇప్పుడు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఈశ్వరప్ప అవినీతి దందా వెలుగుచూసింది.
సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్రట్ ను ప్రభుత్వ పనుల్లో 40శాతం కమీషన్ ఇవ్వాలని పట్టుబట్టడంతో అతడు ఒత్తిడి భరించలేక ఒక వీడియో తీసి ప్రధాని మోడీ, సీఎం బొమ్మైకి పంపి ఆత్మహత్య చేసుకున్నాడు. మీరే నా కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. దెబ్బకు మంత్రి ఈశ్వరప్పతో రేపు రాజీనామా చేయిస్తున్నాయి. నిన్నటివరకూ తాను మంత్రి పదవికి రాజీనామా చేయనన్న ఈశ్వరప్ప అధిష్టానం ఆదేశాలతో ఇప్పుడు రాజీనామా బాటపట్టారు.
ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వాన్ని షేక్ చేసింది. ఈశ్వరప్ప అవినీతి వ్యవహారంపై కర్ణాటక కాంట్రాక్టర్లు అంతా ఏకమై ఉద్యమించారు.
కర్నాటకలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు మంత్రి ఈశ్వరప్పను రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో ఆయన అతడు తలొగ్గి ఈ మేరకు రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు.
దేశంలోనే అత్యధిక అవినీతి మయమైన రాష్ట్రంగా కర్ణాటకకు పేరుంది. నంబర్ 2 తమిళనాడు ఉంటుంది. నంబర్ 3 ఆంధ్రప్రదేశ్ ఉండే అవకాశం ఉంది. దక్షిణాదిలో అభివృద్ధితోపాటు అవినీతి మయమైంది. కర్ణాటక అయితే మరీ దారుణంగా ఉందన్న ఆరోపణలున్నాయి. కర్ణాటకలో అవినీతి కథలపై ‘రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.