https://oktelugu.com/

Analysis on Kapu Leaders Meet at Visakhapatnam: కాపు నాయకులపై ఎన్నో అనుమానాలు?

Analysis on Kapu Leaders Meet at Visakhapatnam : విశాఖలో కాపు నాయకుల సమావేశం మరోసారి వార్తల్లో నిలిచింది. అది కాపుల కోసం.. సంక్షేమం .. సౌభాగ్యం కోసం అని చెప్పుకొచ్చారు. కానీ ఈ కాపు నాయకులపై ఆ సామాజికవర్గంలోనూ అనుమానాలున్నాయి. అందులో పాల్గొన్న వారంతా రాజకీయ నిరుద్యోగులు కావడం గమనార్హం. ఇంతకుముందు పదవులు అనుభవించి.. మంత్రి పదవులు అనుభవించి ఇప్పుడు ఖాళీగా ఉన్న వారు.. ఇవాలా ఆవురావురామంటున్నారు. ప్రాభవం కోసం పాకులాడుతున్నారు. రాజకీయాల్లో ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 28, 2022 / 10:05 PM IST
    Follow us on

    Analysis on Kapu Leaders Meet at Visakhapatnam : విశాఖలో కాపు నాయకుల సమావేశం మరోసారి వార్తల్లో నిలిచింది. అది కాపుల కోసం.. సంక్షేమం .. సౌభాగ్యం కోసం అని చెప్పుకొచ్చారు. కానీ ఈ కాపు నాయకులపై ఆ సామాజికవర్గంలోనూ అనుమానాలున్నాయి. అందులో పాల్గొన్న వారంతా రాజకీయ నిరుద్యోగులు కావడం గమనార్హం. ఇంతకుముందు పదవులు అనుభవించి.. మంత్రి పదవులు అనుభవించి ఇప్పుడు ఖాళీగా ఉన్న వారు.. ఇవాలా ఆవురావురామంటున్నారు. ప్రాభవం కోసం పాకులాడుతున్నారు.

    Analysis on Kapu Leaders Meet at Visakhapatnam

    రాజకీయాల్లో ఈ కాపు నాయకులంతా వెలుగు వెలిగాలని అనుకుంటున్నారు. కానీ వీళ్లు సూత్రధారులు కాదు.. పాత్రధారులు మాత్రమేనని అనుకుంటున్నారు. వీళ్లు నిజంగా ఆ సంక్షేమం కోసమే పనిచేస్తున్న వాళ్లు అయితే ఒక కులంతో రాజకీయ అధికారం సాధ్యం కాదన్నది వీళ్లకు తెలియదా? అన్నది ప్రశ్న..

    ఇక రెండోది అదే కులానికి చెందిన పవన్ కళ్యాణ్ క్లీన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు. ఇవాళ అతడికి మెల్లి మెల్లిగా ఎదుగుతున్నారు. కాపులు అంతా పవన్ వైపు నడుస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ను పక్కనపెట్టి వీళ్లంతా ఒక్కటి అవ్వడం మింగుడుపడడం లేదు. ఎందుకంటే కాపుల్లో పుట్టినా ఎప్పుడూ కులాల పేరు చెప్పుకొని పవన్ రాజకీయం చేయలేదు. కాపులే రాజ్యాధికారంలోకి రావాలని ఆయన చెప్పలేదు. కాపుల మీటింగ్ లకు హాజరు కాలేదు.

    Also Read: పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో కూడా హీరోనే!

    పవన్ అన్ని కులాలు కలిసిపోవాలని మొదట్నుంచి చెప్పుకున్నాడు. జనసేన ప్రణాళికలో కూడా దీన్ని ప్రకటించాడు. అయితే కాపులు మాత్రం పవన్ ను ఓన్ చేసుకున్నారు. పవన్ వెంట నడుస్తున్నారు. ఇంత స్పష్టంగా విజన్ ఉన్న నాయకుడు ఆయన వెంట ఈ కాపు నాయకులు ఎందుకు కలవడం లేదు. మూడో ప్రత్యామ్మాయంగా కాపు నేతలు ఎందుకు సమావేశం పెట్టారన్న దానిపై ‘రామ్’ సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    Also Read: వంగవీటి జిల్లా లొల్లి మళ్లీ మొదలైంది