Bheemla Nayak Movie Issue : భీమ్లానాయక్ వివాదంతో పవన్ కళ్యాణ్ ప్రతిష్ట మసకబారిందా? లేనిపోని వివాదాలను కొనితెచ్చుకొని జగన్ ప్రభుత్వం అప్రతిష్టపాలైందా? ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారిన ఘటన.. ఎందుకంటే భీమ్లానాయక్ మూవీపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందన్నది ప్రజల్లో ఉన్న భావన. దీని వల్ల జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేక పెరిగింది. ఒక్క సినిమా ఆంధ్రా రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది.

మంత్రులు భీమ్లానాయక్ ను ఎంత విమర్శించినా.. ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ పై సానుభూతి చూపారు. ఇది పవన్ కళ్యాణ్ కు ఒక విధంగా ప్లస్ పాయింట్ అయ్యింది. భీమ్లానాయక్ సినిమా ఎట్లున్నా చూడాలన్న కసి ప్రజల్లో పెరిగింది. ఎందుకు ఈ వివాదం ప్రజల్లోకి వెళ్లిందంటే.. ముందుగా సినిమా సక్సెస్ అయ్యింది.
సినిమా ఫ్లాప్ అయితే జగన్ దే మాట నెగ్గేదే. సినిమా సక్సెస్ కావడంతో పవన్ కు ప్లస్ అయ్యింది.. జగన్ కు మైనస్ అయ్యింది. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం భీమ్లానాయక్ కు పెద్ద పీట వేస్తే రూ.10కే టికెట్ అమ్మనిచ్చి ఏపీ ప్రభుత్వం అభాసుపాలైంది. నిర్మాతలకు ఎంత నష్టం వస్తుందని ప్రజలే నిలదీస్తున్నారు.
Also Read: Top 1 Movie Bheemla Nayak : ఈనెల రివ్యూ: అన్ని సినిమాల కంటే టాప్ భీమ్లానాయక్ నే!
ఏపీ మంత్రుల తీరు కూడా జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమైంది. ‘భీమ్లానాయక్ ’ వివాదంతో జగన్ ప్రభుత్వం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ రీల్ హీరో నుంచి రియల్ హీరోగా మారిపోయారు. ఎన్టీఆర్ తర్వాత ప్రభుత్వానికి లొంగకుండా ఎదురొడ్డి నిలబడ్డ మొనగాడిగా నిలిచాడు. భీమ్లానాయక్ వివాదంలో అసలు తప్పు ఎవరిది? అన్న అంశంపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు..
Also Read: Bheemla Nayak Collections: భీమ్లానాయక్ కలెక్షన్ల వర్షం: ఈ వారంలో అన్ని కోట్ల టార్గెట్ ఖతం..
Recommended Video:


[…] […]
[…] […]
[…] OTT: ఓటీటీ సంస్థలు అన్నీ నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో అప్ డేట్ అవుతూ వస్తున్నాయి. పైగా ఈ కరోనా కాలంలో సినిమా రంగానికి ఏకైక ఆశా కిరణం నిలిచింది కూడా ఓటీటీలే. మరి ఇప్పటికే ఎన్నో ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా మనకు టీవీ అవసరం ఉందా ? ఇది ప్రతి మధ్యతరగతి వ్యక్తి ఈ మధ్య తరుచు గా అడుగుతున్న ప్రశ్న. […]
[…] Power Star Pawan Kalyan: పవన్ కల్యాణ్ కెరీర్ లో హిట్ల కన్నా ప్లాపులే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు పదేండ్ల పాటు ఎలాంటి హిట్ లేకపోయినా కూడా అదే స్థాయిలో ఫ్యాన్ బేస్‌ను మెయింటేన్ చేయడం అంటే ఒక్క పవన్‌కే సాధ్యం అయింది. వేరే వేరే హీరోలకు అయితే అన్ని ఏండ్లు హిట్ రాకపోతే అభిమానులు ఎప్పుడో వారిని మర్చిపోయేవారు. కానీ పవన్‌కు మాత్రం హిట్టు, ప్లాపులతో సంబంధం లేదు. కానీ రాజకీయాల్లోకి వెళ్లి వచ్చిన తర్వాత ఆయనకు బాగానే కలిసి వస్తోంది. […]