https://oktelugu.com/

Janasena Party 2024 Elections : 2024 ఎన్నికలకు పవన్ కళ్యాణ్ వ్యూహం ఎలా ఉండాలి?

Janasena Party 2024 Elections : వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవాలంటే ఎలాంటి వ్యూహం అనుసరించాలి. కనీస సీట్లు రావాలంటే జనసేన ఎటువంటి ఎత్తుగడలు వేయాలి? అంతిమంగా వ్యూహం ఎలా ఉండాలి? ఎలా అమలు చేయాలన్నది పవన్ కళ్యాణ్ ఇష్టం. ఏ వ్యూహానికైనా సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలు ఉండాలి. మూడు వ్యూహాలు ఉన్నప్పుడే సక్సెస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సామాజిక వ్యూహం 100శాతం కరెక్ట్. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం, సాధికారిత ఖచ్చితంగా రావాలి. […]

Written By: , Updated On : January 16, 2023 / 05:18 PM IST
Follow us on

Janasena Party 2024 Elections : వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవాలంటే ఎలాంటి వ్యూహం అనుసరించాలి. కనీస సీట్లు రావాలంటే జనసేన ఎటువంటి ఎత్తుగడలు వేయాలి? అంతిమంగా వ్యూహం ఎలా ఉండాలి? ఎలా అమలు చేయాలన్నది పవన్ కళ్యాణ్ ఇష్టం. ఏ వ్యూహానికైనా సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలు ఉండాలి. మూడు వ్యూహాలు ఉన్నప్పుడే సక్సెస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సామాజిక వ్యూహం 100శాతం కరెక్ట్. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం, సాధికారిత ఖచ్చితంగా రావాలి. పవన్ చెప్పింది సమర్థించాల్సిందే..

2024 ఎన్నికలకు పవన్ కళ్యాణ్ వ్యూహం ఎలా ఉండాలి? | Analysis on Janasena Party 2024 Elections

ఆర్థిక వ్యూహాల్లో బీజేపీ, జయప్రకాష్ నారాయణ్ చెప్పేదానికి అనుగుణంగా వెళితే లాభం. పరిపాలన సంస్కరణలను జయప్రకాష్ నారాయణ్ లాగానే ఉండాలి. వీటితో అన్నింటికన్నా ముఖ్యమైనది రాజకీయ వ్యూహం. రాజకీయవ్యూహానికి సప్లిమెంట్ గా పైన వ్యూహాలు ఉన్నప్పుడే ఎదగగలం.

ప్రజలు జనసేనకు ఎందుకు కనెక్ట్ కావాలన్నది ఇక్కడ కీలక అంశం. ఓ నిజాయితీ, నిబద్ధత కలిగిన గొప్ప ఆదర్శవంత నాయకుడు పవన్ ను కలిగి ఉండడం ముఖ్యం. పార్టీకి లీడర్ నడిపించేవాడు ఉండాలి. వైసీపీ, టీడీపీతో పోల్చితే పవన్ పవర్ ఫుల్. ఆలోచనలు పవన్ వి భిన్నంగా ఉంటాయి. ప్రాంతీయ సమానత్వం, జాతీయ భావాలు మెండుగా ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి నేత నాయకుడిగా ప్రజలకు అవసరం. దీని వల్ల ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాయకుడు, ఇటు ఆలోచనలు రెండూ విభిన్నమైనవి కాబట్టే.. జనసేనను ప్రజలు ఆదరిస్తారు..

2024 ఎన్నికలకు పవన్ కళ్యాణ్ వ్యూహం ఎలా ఉండాలనే దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూద్దాం.