Janasena Party 2024 Elections : 2014లో టీడీపీ, బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పై నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోరాటం చేశారు. అంతే కానీ మద్దతు ఇచ్చాం కదా అని చెట్టాపట్టాలేసుకుని తిరగలేదు. 2019లో మాత్రం జనసేన ఒంటరిగా ఎన్నికలకు వెళ్లింది. టీడీపీతో కలిసి వెళ్తుందని వైసీపీ ప్రచారం చేసినా .. ఆ ప్రచారాన్ని జనసేనాని తిప్పికొట్టారు. పొత్తు పెట్టుకోకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. టీడీపీతో సఖ్యత ఉన్నా పొత్తు విషయంలో జనసేన జాగ్రత్త పడింది. అప్పటికే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను జనసేనాని పసిగట్టారు. కాబట్టే ఆ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లారు. ఒకవేళ టీడీపీతో కలిసి వెళ్లి ఉంటే.. టీడీపీపై ఉన్న అసమ్మతి జనసేనకూ అంటుకునేది. ఈ విషయంలో జనసేనాని చాకచక్యంగా వ్యహరించారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలను వైసీపీ అధిష్టానం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటోంది.