https://oktelugu.com/

Janasena Jana Vani Program : పవన్ కళ్యాణ్ పై చిగురిస్తున్న ఆశలు

Analysis on Janasena Jana Vani Program జనసేన పార్టీ గుణాత్మక మార్పు దిశగా సాగుతోంది. రాజకీయ వేదిక నుంచి పరిపూర్ణ రాజకీయ పార్టీగా మార్పు చెందుతోంది. మార్పులు వడివడిగా వేగంగా సాగుతోంది. ఇప్పటం ఆవిర్భావ సభ నుంచే ఈ మార్పు సాధ్యమైంది. సంస్థాగతంగా పటిష్టం కావడం కోసం జనసేన తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ప్రజా సమస్యలపై జనసేన పోరాటాలు ప్రజల్లో ఆ పార్టీపై అభిమానం పెరిగేలా చేశాయి. కౌలు రైతుల భరోసా ప్రజల్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : July 4, 2022 / 07:11 PM IST
    Follow us on

    Analysis on Janasena Jana Vani Program జనసేన పార్టీ గుణాత్మక మార్పు దిశగా సాగుతోంది. రాజకీయ వేదిక నుంచి పరిపూర్ణ రాజకీయ పార్టీగా మార్పు చెందుతోంది. మార్పులు వడివడిగా వేగంగా సాగుతోంది. ఇప్పటం ఆవిర్భావ సభ నుంచే ఈ మార్పు సాధ్యమైంది. సంస్థాగతంగా పటిష్టం కావడం కోసం జనసేన తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ప్రజా సమస్యలపై జనసేన పోరాటాలు ప్రజల్లో ఆ పార్టీపై అభిమానం పెరిగేలా చేశాయి. కౌలు రైతుల భరోసా ప్రజల్లో మార్పునకు నాంది పలికింది.

    రాజకీయంగా పటిష్టం కావడానికి జనసేన నేతలు, కార్యకర్తలకు శక్తినిచ్చేలా ప్రణాళికలు పవన్, నాగబాబు, నాదెండ్లతో కలిసి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించి బూస్ట్ నిచ్చారు.

    జనవాణిని సామాన్యుల వాణిగా వినిపించేలా చేసింది జనసేన. ఈ గుణాత్మక మార్పు జనసేనను అధికారానికి చేరువ చేస్తోంది. జనసేన పుట్టినప్పుడు దానికి ఒక రూపం లేదు. 2014లో మోడీ, చంద్రబాబుకు మద్దతు ప్రకటించి పోటీచేయలేదు. 2019లో రాజకీయ పార్టీగా జనసేన రూపుదిద్దినా.. పూర్తిస్థాయిలో నిర్మాణం కాలేదు. కేవలం ఎన్నికల ముందు బరిలోకి దిగారు.

    ఇప్పటం జనసేన ఆవిర్భావ సభ నుంచి పార్టీ పూర్తిగా పరిపూర్ణ రాజకీయ పార్టీగా అవతరించింది. ముఖ్యంగా నిన్న జనవాణి కార్యక్రమం సక్సెస్ తో ప్రజల్లో ప్రత్యామ్మాయ పార్టీగా ఆవిర్భవించినట్టైంది. పవన్ కళ్యాణ్ పై చిగురిస్తున్న ఆశలు.. జనసేన పరిస్థితిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..