Hyderabad Minor Girl Incident : 28న రేప్.. 31న ఎఫ్ఐఆర్.. 3న అరెస్ట్.. ఏం జరుగుతోంది?

Analysis on Hyderabad Minor Girl Incident తెలంగాణ గ్యాంగ్ రేప్ ఘటనలో ఎన్నో నిజాలు మరుగున పడిపోతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మే 28న మైనర్ బాలికపై రేప్ జరిగితే.. 31న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. 3న అరెస్ట్ చేశారని.. వారం తర్వాత చర్యలేమిటన్నది చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో హోంమంత్రి మనవడు, ఎమ్మెల్యే కుమారుడిపై ఆరోపణలు రావడం.. కేసులో వారు లేరని పోలీసులు అనడం.. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వీడియోలు ఫోటోలు బయటపెట్టి […]

Written By: NARESH, Updated On : June 4, 2022 5:43 pm
Follow us on

Analysis on Hyderabad Minor Girl Incident తెలంగాణ గ్యాంగ్ రేప్ ఘటనలో ఎన్నో నిజాలు మరుగున పడిపోతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మే 28న మైనర్ బాలికపై రేప్ జరిగితే.. 31న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. 3న అరెస్ట్ చేశారని.. వారం తర్వాత చర్యలేమిటన్నది చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో హోంమంత్రి మనవడు, ఎమ్మెల్యే కుమారుడిపై ఆరోపణలు రావడం.. కేసులో వారు లేరని పోలీసులు అనడం.. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వీడియోలు ఫోటోలు బయటపెట్టి ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని తెలుపడం సంచలనమైంది.

ఇక హైదరాబాద్ లో దిశను హత్యాచారం చేసిన లారీ డ్రైవర్, క్లీనర్లను ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులు.. ఇప్పుడు బడాబాబులు చేసిన ఈ అత్యాచార ఘటనను ఎందుకు దాస్తున్నారు? ఎందుకు మీడియా ముందు ప్రవేశపెట్టలేదు.? అసలు నిందితులను వదిలేసి.. వేరేవాళ్లను చూపిస్తున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

దిశా ఎన్ కౌంటర్ ఆగమేఘాలపై చేసి.. బాలికపై గ్యాంగ్ రేప్ జరిగి వారం అయినా చర్యలు తీసుకోకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. అక్కడ నిందితులు సామాన్యులు అని.. ఇక్కడ నిందితులు పలుకుబడి కలిగిన వాళ్లని చెప్పకతప్పదు.

విజయశాంతి నటించిన ప్రతిఘటన సినిమాలో నాటి చర్యలకు.. ఇప్పుడు హైదరాబాద్ లో చర్యలకు ఏమైనా తేడా ఉందా? అంటే లేదనే చెప్పాలి. తెలంగాణ ఆడపడుచులూ మిమ్మల్ని ఎవరూ కాపాడుతారు? అంటూ నిలదీస్తున్నారు. తెలంగాణలో గ్యాంగ్ రేప్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.