Analysis on Great Andhra Political Survey తెలుగులో నంబర్ 1 వెబ్ సైట్ గా చెప్పుకుంటున్న ఆ మీడియా ప్రాంతాల వారీగా చేసిన సర్వే వైరల్ అయ్యింది. వైసీపీ ప్రజాదరణపై చేసిన ఈ సర్వేలో ఏం తేలిందంటే.. రాయలసీమలో ప్రకాశం, నెల్లూరులను కలుపుకుంటే 60 శాతం మంది వైసీపీకి అనుకూలమని తేలింది.
ఇక ఉత్తరాంధ్రలో 54శాతం మంది అనుకూలంగా ఉన్నారని తేలింది. సెంట్రల్ ఆంధ్రలోని కృష్ణ, గుంటూరులో 50శాతం మంది మాత్రమే టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. గుంటూరు, విజయవాడ నగరాల్లో పూర్తి వ్యతిరేకత వైసీపికి ఉంది. గోదావరి జిల్లాలకు వచ్చేసరికి అసలు ఇక్కడ ముక్కోణపు పోటీ ఉంటుందని.. 40శాతం వైసీపీకి, 35 శాతం టీడీపీకి, 25శాతం జనసేనకు అనుకూలంగా ఉంది.
దీన్ని బట్టి రాష్ట్రవ్యాప్తంగా 51శాతం తో వైసీపీ అధికారంలోకి 2024లో వస్తుందని ఆ వెబ్ సైట్ సర్వే తేల్చింది. అయితే వైసీపీకి అనుకూలమైన ఈ వెబ్ సైట్ లెక్కలను సరిగా చూడడానికి లేదు.
గోదావరి జిల్లాల్లో కాపులు, జనసేనకు ఎక్కువ బలం ఉంది. గోదావరి జిల్లాల్లో తీర్పే రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి దోహదపడుతుంది. అక్కడి ప్రజలు ఏ పార్టీకి ఓట్లేస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది. అక్కడ జనసేనకు 25శాతం బలం ఉండడం ఆషామాషీ వ్యవహారం కాదు.. అక్కడ తిరిగి ప్రజల్లో సానుభూతి సంపాదిస్తే ఇది 40శాతానికి పైగా పెరగొచ్చు. జనసేనను ఆ జిల్లాల్లో బలోపేతం చేస్తే మంచి అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ సర్వే ఫలితాన్ని ఎలా చూడాలి? జనసేనకు ఉన్న గెలుపు అవకాశాలు ఏమిటన్న దానిపై ‘రామ్ గారి’ సునిశిత విశ్లేషణ వీడియోను కింద చూడొచ్చు.