https://oktelugu.com/

Janasena TDP Alliance : ఏది ముఖ్యం.? ముఖ్యమంత్రి కావడమా? జగన్ ను సీఎం కుర్చీలోంచి దించడమా?

Janasena TDP Alliance ఏపీ రాజకీయాల్లో టీడీపీ ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. టీవీ చానెల్స్ లో టీడీపీ నేతలు జనసేనను తక్కువగా చూపిస్తున్నారు. పోయిన సారి ఎన్నికల్లో 6శాతం కూడా లేని జనసేన అసలు తమకు పోటీనే కాదని టీడీపీ అధికార ప్రతినిధులు ఫోకస్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినాయకత్వం కూడా అదే ఫోకస్ చేయాలని టీడీపీ నేతలకు చెబుతోంది. మీడియాలో మెజార్టీ చంద్రబాబు అనుకూల మీడియానే. మీడియాలో చంద్రబాబును […]

Written By:
  • NARESH
  • , Updated On : June 14, 2022 / 07:20 PM IST
    Follow us on

    Janasena TDP Alliance ఏపీ రాజకీయాల్లో టీడీపీ ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. టీవీ చానెల్స్ లో టీడీపీ నేతలు జనసేనను తక్కువగా చూపిస్తున్నారు. పోయిన సారి ఎన్నికల్లో 6శాతం కూడా లేని జనసేన అసలు తమకు పోటీనే కాదని టీడీపీ అధికార ప్రతినిధులు ఫోకస్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినాయకత్వం కూడా అదే ఫోకస్ చేయాలని టీడీపీ నేతలకు చెబుతోంది.

    మీడియాలో మెజార్టీ చంద్రబాబు అనుకూల మీడియానే. మీడియాలో చంద్రబాబును , టీడీపీని లేపేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఏబీఎన్ ఆర్కే అయితే తన కాలంలో జనసేనను ఒక కులానికి చెందిన పార్టీగా ప్రజల్లోకి వదలుతున్నారు. పవన్ కళ్యాణ్ 3 ఆప్షన్ల వల్ల వ్యతిరేక ఓట్లు చీలుతాయన్నది ఆర్కే మాట.. పవన్ కళ్యాణ్ చెప్పినదానికి జగన్ ను ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించడం కారణమా? లేక తను ముఖ్యమంత్రి కావడమా? అన్నది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం.

    పవన్ కళ్యాణ్ ది అత్యాశ అని ఆర్కే అంటున్నారు. కానీ చంద్రబాబును గద్దెనెక్కించి ఆయన కింద పవన్ కళ్యాణ్ ను బానిసగా బతకాలన్నది ఆర్కే ఉబలాటపడుతున్నాడు. సామాజికవర్గం ఓట్లన్నీ టీడీపీకి వేస్తేనే న్యాయమట..

    పీఆర్పీ ని కూడా ఇలానే రెండు పేపర్లు, ఈ ఆర్కేలు జనాలను కన్ఫ్యూజ్ చేసి చిరంజీవిని అణగదొక్కారు. ఇప్పుడు ఈ ఆటలు సాగవు. జనాలు ఇప్పుడు పేపర్లను నమ్మే పరిస్థితి లేదు. సోషల్ మీడియా బలంగా ఉంది. దాన్నే జనం నమ్ముతున్నారు. ఆర్కే చేస్తున్న ప్రచారం జనసైనికులు, ప్రజలకు పట్టదు.

    జగన్ తో ప్రత్యక్ష పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్.. పరోక్ష పోరాటం చంద్రబాబుతో చేస్తున్నట్టే లెక్క. పొత్తుల ఎత్తుల్లో పవన్ కళ్యాణ్ బలహీన పరచాలని టీడీపీని పైకి లేపాలని కుట్ర జరుగుతోంది. మూడో శక్తి లేకుండా టీడీపీ బ్యాచ్ కేవలం రెండు సామాజికవర్గాలకే అధికారం పరిమితం చేయాలని చూస్తున్నారు. జనసేనపై తెలుగుదేశం విష ప్రచారంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది చూడొచ్చు..