Analysis on CM Jagan Target for 2024 Elections : ఏపీ సీఎం జగన్ కు రెండు సంవత్సరాల ముందే ఎన్నికలు గుర్తొచ్చాయి. అధికారంలోకి వచ్చి మూడేళ్లలోనే జగన్ కు ఎన్నికలు గుర్తుకురావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆంధ్రా రాజకీయం హాట్ హాట్ గా మారింది. ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే జగన్ ఎన్నికలకు సిద్ధమవ్వడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
జగన్ అన్నట్టుగా 175/175 సీట్లు గెలవడం సాధ్యమేనా? అన్నది ఇక్కడ ప్రశ్న.ఆచరణాత్మకం ఏంటన్నది ఆలోచించాలి. జగన్ ఊహాల్లోకాల్లోనే విహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా రెండేళ్ల ముందుగానే జగన్ ఎన్నికల జపం చేయడానికి రెండు మూడు కారణాలు కనిపిస్తున్నాయి.
ఇందులో ప్రధానమైనది డైవర్షన్ పాలిటిక్స్. ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి జగన్ ఈ జపం చేస్తున్నారని తెలుస్తోంది. దేశంలోనే అత్యధిక పెట్రోల్ ధర ఏపీ తెలంగాణలో ఉంది. ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉంది. ఆర్థిక క్రమశిక్షణ లేదు. విపరీతమైన అప్పులు. నెల గడవడానికి తిప్పలు. పదోతరగతి పరీక్ష ఫలితాలు దారుణంగా ఉన్నాయి. అవినీతిలో ఏపీ అగ్రస్థానం ఉంది.
ఏపీలో సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్యల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి జగన్ ఆడుతున్న పన్నాగంగా జగన్ వేస్తున్నాడని తెలుస్తోంది. పార్టీలో పుట్టుకొచ్చిన అసంతృప్తిని కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేయవచ్చని తెలుస్తోంది.
జగన్ ఎన్నికల వ్యాఖ్యలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.