AP Cinema Regulation Amendment Bill: టాలీవుడ్ పరిశ్రమకు తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. పలువురు నటీనటులు టీడీపీ కోసం గత కొన్నేళ్లుగా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీతో చాలా తక్కువమంది మాత్రమే సాన్నిహిత్యం కలిగి ఉన్నారు. వారిలో దిగ్గజ ప్రముఖులు ఎవరూ లేరు. అదే చంద్రబాబుతో స్వయంగా భేటి కాగల పరిచయాలున్నాయి. చంద్రబాబుపై కోపమో.. లేక టాలీవుడ్ పై ద్వేషమో కానీ ఏపీ సీఎం జగన్ సినీ పరిశ్రమను చావుదెబ్బ తీసే నిర్ణయాన్ని తీసుకున్నారు. కోలుకోకుండా చేశారు.
సినిమా టికెట్ల విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సినీ పరిశ్రమను కూకటి వేళ్లతో పెకిలించినట్టైంది. ఇన్నాళ్లు ఇష్టారాజ్యంగా బెనిఫెట్, ఫ్యాన్స్, ప్రీ షోలు వేస్తూ వేలకు వేలు టికెట్ల రేట్లు అమ్ముకొని కోట్లు కొల్లగొట్టిన హీరోలు, నిర్మాతలకు జగన్ సర్కార్ నిర్ణయం శరాఘాతమైంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. ‘‘ఏ థియేటర్ లోనూ 4 షోలకు మించి వేయడానికి లేదు. టికెట్ రేట్లను పెంచడానికి లేదు.’’ దీంతో రూ.100 ఉండే టికెట్ తో సినిమాలకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి. ఇదొక గొప్ప చర్యగా ఏపీ ప్రభుత్వం వర్ణిస్తోంది. పేద, మధ్యతరగతి వర్గానికి ఊరటనిస్తుందట..
అయితే పేద, మధ్యతరగతి వర్గం ఎక్కువగా ఉండడంతో జగన్ సర్కార్ నిర్ణయానికి ఆమోదం లభించింది. ఆంధ్రలో వచ్చే మొత్తం బడ్జెట్ కూడా సంక్షేమానికే ఖర్చవుతోంది. కానీ చలనచిత్ర పరిశ్రమ అనేది ఒక వ్యాపారం. ఆ వ్యాపారం అభివృద్ధి చెందడానికి నిబంధనలు , అడ్డుగోడలు పెట్టకూడదు. జగన్ నిర్ణయంతో అభివృద్ధి చెందే చిత్రపరిశ్రమను మేకులు కొట్టి ఆపేశారు.
Also Read: స్టార్ హీరోలకు జగన్ ఓ గండంగా మారాడు !
ఒకనాడు చిత్ర పరిశ్రమ అంటే అతితక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసేవారు. ఇవాళ ఆ రోజులు లేవు. బాహుబలి లాంటి సినిమాలు వందల కోట్ల పెట్టుబడి పెట్టి సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్ తో పోల్చుకుంటే తెలుగు సినిమా తక్కువ మార్కెట్ అయినా కూడా ప్యాన్ ఇండియా మూవీలు తీసి దేశ ప్రజలంతా చూసేలా ఆదాయం తీసుకువస్తున్నారు. అది ఎలాగంటే మొదటి వారంలోనే ఎక్కువ థియేటర్లలో ఎక్కువ షోలు వేసి.. ఎక్కువ ధరకు టికెట్లు అమ్మి పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అది తప్పా? ప్రాథమిక వ్యాపార సూత్రం.. ఇందులో ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టడం లేదు. నిర్మాతలు సొంత డబ్బులతో పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తే వాటిపై ప్రభుత్వ అజమాయిషీ ఏంటనేది ఇక్కడ ప్రశ్న.. అప్పు తీసుకొచ్చిసినిమాలు తీస్తే దానికి ప్రభుత్వం నిబంధనలు పెట్టడం ఏంటన్నది ఇక్కడ ప్రశ్న. జగన్ నిర్ణయంతో సినీ పరిశ్రమ పెరగదు. పరిశ్రమ కుంచించుకు పోతుంది.
బాహుబలి లాంటి తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైంది. దానికి హంగులు, ఆర్భాటాలు బడ్జెట్ పెట్టారు. అలాంటి సినిమాలు రావాలంటే ప్రోత్సహించాలి. కానీ జగన్ సర్కార్ నిర్ణయంతో చిత్ర పరిశ్రమ అభివృద్ధిని అడ్డుకున్నట్టు కాదా? అన్నది ఇక్కడ ప్రశ్న.. జగన్ సర్కార్ టాలీవుడ్ ను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఈ నిర్ణయాలతో కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు, హీరోలు, దర్శకులకు శరాఘాతమే. జగన్ నిర్ణయంపై సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తుందనే వేచిచూడాలి. ‘సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీసిన జగన్ ’ తీరుపై రామ్ టాక్ స్పెషల్ వీడియో మీకోసం..
Also Read: ఏపీ ప్రభుత్వంపై సర్పంచ్ ల తిరుగుబాటు