https://oktelugu.com/

Radhakrishna – Pawan Kalyan : ఏబీఎన్ ఆర్కే, చంద్రబాబు కుట్రలపై జాగ్రత్త పవన్!

Radhakrishna – Pawan Kalyan : ఊహించిందే జరిగింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇలాంటి మాటలు మాట్లాడుతాడని ముందే ఊహించారు. టైమింగ్ ఒక్కటే తేడా తప్పితే ఈయన చేష్టలు ముందు నుంచి టీడీపీకి అనుకూలమే.. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ఒప్పుకోదనే నమ్మకం ఆర్కే మాటలతో కలుగుతోంది. అందరూ అనుకుంటున్నట్టుగా చంద్రబాబు పైకి పవన్ కళ్యాణ్ ను పొగిడినట్టే నటిస్తుంటాడు. వెనుక వేరే వాళ్ల చేత కుట్రలు చేస్తుంటాడన్నది […]

Written By: , Updated On : February 21, 2023 / 02:35 PM IST
Follow us on

ఎజెండా సెట్ చేసిందెవరు? అమలు చేస్తుందెవరు? || Analysis on ABN Radhakrishna Comments on Pawan Kalyan

Radhakrishna – Pawan Kalyan : ఊహించిందే జరిగింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇలాంటి మాటలు మాట్లాడుతాడని ముందే ఊహించారు. టైమింగ్ ఒక్కటే తేడా తప్పితే ఈయన చేష్టలు ముందు నుంచి టీడీపీకి అనుకూలమే.. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ఒప్పుకోదనే నమ్మకం ఆర్కే మాటలతో కలుగుతోంది.

అందరూ అనుకుంటున్నట్టుగా చంద్రబాబు పైకి పవన్ కళ్యాణ్ ను పొగిడినట్టే నటిస్తుంటాడు. వెనుక వేరే వాళ్ల చేత కుట్రలు చేస్తుంటాడన్నది బహిరంగ రహస్యం. జగన్ కు, చంద్రబాబుకు తేడా ఇదే..

జగన్ ప్రత్యక్షంగా జగన్ ను ఎదుర్కొంటున్నాడు.. చంద్రబాబు పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఎదగకుండా వ్యూహాలు పన్నుతున్నాడు. ఈ పద్ధతి 2008లో చంద్రబాబు అమలు చేశాడు. 2019లో పవన్ క్యారెక్టర్ ను కించపరిచేలా పచ్చ మీడియాలో చంద్రబాబు చేయించారు.

2019.. 2024 ఒక్కటి కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా జనసేన అప్రమత్తంగా ఉంది. ఏబీఎన్ రాధాకృష్ణ మాట్లాడింది.. మాట్లాడించింది చంద్రబాబే అనడంలో సందేహం లేదు. ఆర్కే పాత్రధారి మాత్రమే. దీన్ని తెలుసుకోకుండా జనసేన మూస పద్ధతిలో వెళితే పవన్ కు నష్టం. స్వతంత్ర్య వైఖరితో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.

ఏబీఎన్ ఆర్కే, చంద్రబాబు కుట్రలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.