Congress: తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు పీకే జ్వరం పట్టుకుంది. ఒకవైపు కాంగ్రెస్ తో జట్టుకడుతూ మరోవైపు టీఆర్ఎస్ ను గెలిపిస్తానంటే ఎలా నమ్ముతారు. అంత పిచ్చోళ్లా లేక పీకే మైండ్ గేమ్ ఆడుతున్నాడా? అనే విషయాలపై కాంగ్రెస్ నేతలు బుర్రలు గోక్కుకుంటున్నారు. రాష్ట్రంలో పరస్పర శత్రువులైన కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎలా కలుస్తాయి? రెండు పార్టీలు ఎలా అధికారం చేపడతాయి? అయితే పీకేకన్నా బుద్ధి ఉండాలి. లేకపోతే కాంగ్రెస్ కైనా కాస్త బుర్ర ఉండాలనే వాదనలు వస్తున్నాయి. దీనిపై అందరు ఆలోచనలో పడిపోయారు.

అయితే పీకే ఇప్పటికే పలువురు నేతలు ఓటమి అంచుల్లో ఉన్నారని నివేదిక ఇవ్వడంతో వారి జాతకాలు కూడా తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో పీకే వ్యూహమేంటి? రాష్ట్రంలో రెండు పార్టీలను ఎలా అధికారంలో నిలుపుతారు? అయితే టీఆర్ఎస్ అయినా ఉండాలి. లేదంటే కాంగ్రెస్ అయినా పోటీలో ఉంటుంది కానీ రెండు పార్టీలను సమన్వయం చేస్తానంటే పీకే మానసిక స్థితి ఏమిటనే దానిపై అందరిలో ఆలోచనలు వస్తున్నాయి.
దీనిపై అధిష్టానం సైతం మాట్లాడటం లేదు. ఓర్పు వహించండి అన్ని సర్దుకుంటాయి. పరిస్థితిలో మార్పు వస్తుందని నమ్ముతున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం పీకే తన స్వార్థం కోసం రెండు పార్టీలను బలిపశువులను చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే బీజేపీతో రహస్య ఒప్పందం ఏదైనా జరిగిందా అనే కోణంలో కూడా నేతలు తలమునకలవుతున్నారు. మొత్తానికి పీకే జ్వరం ఇప్పుడు తెలంగాణలో హాట్ గా మారుతోంది.

రాబోయే ఎన్నికల్లో పీకే కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారా? లేక టీఆర్ఎస్ కా అనేది అంతుచిక్కడం లేదు. రెండు పార్టీలకు సారధ్యం వహిస్తే రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో తెలియడం లేదు. దీంతో కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకుని కాంగ్రెస్ ను ముంచుతారా? లేక కాంగ్రెస్ డబ్బులతో టీఆర్ఎస్ కొంప ముంచుతారో అర్థం కాని పరిస్థితి. దీంతో నేతలు తలలు బాదుకుంటున్నారు. పీకే విధానమేంటి? ఏ పార్టీతో జతకడతారు? ఏ పార్టీలో ఉంటారు? అనే విషయాలపై ఇంతవరకు స్పష్టత లేదు. కాంగ్రెస్ నేతలు మాత్రం పీకే వ్యవహారంపై గరం అవుతున్నారు
రాష్ట్రంలో ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంటోంది. బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో కేసీఆర్ నాటకాలను బయటపెడుతూ బండి సంజయ్ దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పీకే వ్యూహాలు అమలు చేయాలని ఉత్సాహంతో ఉన్నా ప్రస్తుత తరుణంలో పీకే వ్యవహారం ఎటు దారి తీస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు.