టీ.మంత్రులంతా బిందాస్..ఆయన తప్పా?

కక్కు వచ్చినా.. ఇంకోటి వచ్చినా అస్సలు అపుకోలేరంటారు. కానీ ఇప్పుడా మంత్రికి ఎక్కడా లేని ఉపద్రవం వచ్చింది. అందరికీ సెలవులు ఇచ్చిన ఆ మహమ్మారి.. ఆ మంత్రికి మాత్రం చుక్కలు చూపిస్తోందట.. పాపం ఆ మంత్రి కూడా తెగ కష్టపడుతున్నాడు. కానీ యూనివర్సల్ సమస్య. దాన్ని కంట్రోల్ చేయడం అగ్రరాజ్యాల వల్లే కావడం లేదు. ఈయన వల్ల ఏం అవుతుంది. ‘ఓ మంచి పనుమంతుడు’ అయిన ఆ మంత్రిని ఇప్పుడు ఈ కరోనా ఎంత పనిచేస్తోందని తెలంగాణ […]

Written By: NARESH, Updated On : April 30, 2021 7:53 pm
Follow us on

కక్కు వచ్చినా.. ఇంకోటి వచ్చినా అస్సలు అపుకోలేరంటారు. కానీ ఇప్పుడా మంత్రికి ఎక్కడా లేని ఉపద్రవం వచ్చింది. అందరికీ సెలవులు ఇచ్చిన ఆ మహమ్మారి.. ఆ మంత్రికి మాత్రం చుక్కలు చూపిస్తోందట.. పాపం ఆ మంత్రి కూడా తెగ కష్టపడుతున్నాడు. కానీ యూనివర్సల్ సమస్య. దాన్ని కంట్రోల్ చేయడం అగ్రరాజ్యాల వల్లే కావడం లేదు. ఈయన వల్ల ఏం అవుతుంది. ‘ఓ మంచి పనుమంతుడు’ అయిన ఆ మంత్రిని ఇప్పుడు ఈ కరోనా ఎంత పనిచేస్తోందని తెలంగాణ రాజకీయవర్గాల్లో ఒకటే చర్చ జరుగుతోంది.

తెలంగాణ మంత్రులంతా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో వచ్చిన హాలీడేస్ ను ఎంజయ్ చేస్తున్నారు. పాఫం.. ఒక్క మంత్రి ఈటల మాత్రం ఇంతటి కరోనా కల్లోలం ఆస్పత్రులు, రోగులు, సమీక్షలు అంటూ క్షణం తీరికలేకుండా గడుపుతున్నాడట..

తెలంగాణలోని ముఖ్యంగా హైదరాబాద్ లోని మంత్రులు సైతం తమ వ్యవసాయ క్షేత్రాలు, పొలాల వద్దకు వెళ్లి సిటీకి దూరంగా హాయిగా కాలం గడిపేస్తున్నారు. ఓ మంత్రి అడవుల్లో ఉంటున్న గూడులు గోపురాలు సందర్శిస్తూ ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నాడట..

ఇక ఖమ్మం మంత్రి పువ్వాడ మాత్రం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నాడు. వరంగల్ మంత్రులు సైతం మొన్నటి వరకు ఎంజాయ్ చేసి ఈరోజు దాకా బిజీగా గడిపారు. ఎన్నికలు ముగియడంతో వారు కూడా రిలీక్స్ అయిపోతున్నారు.

మంత్రి కేటీఆర్ కు కరోనా సోకడంతో ప్రస్తుతం హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ ఆఫీసులోనే హోం ఐసోలేషన్ లో ఉంటూ సోషల్ మీడియాతోపాటు తనకు నచ్చిన సినిమాలన్నింటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడని భోగట్టా..

కానీ ఒక్క వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల పరిస్థితియే కుడిదిలో పడ్డ ఎలుకలా గిలాగిలా కొట్టేసుకుంటున్నాడట.. కరోనా రోజురోజుకు తీవ్రంగా కావడం.. కేసులు పెరగడం.. మరణాలు.. ఆక్సిజన్ కొరత తీర్చడం.. హైకోర్టు మొట్టికాయలు ఇలా అన్నింటి భారం తనపై వేసుకొని గిలగిలలాడిపోతున్నాడట.. అందరికీ ఈ టైంలో రెస్ట్ దొరికితే పాపం తెలంగాణ రెండో ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖ దక్కించుకున్న ఈటలకు మాత్రం కంటి మీద కునుకు కరువైందట..