Amit Shah- TDP: వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని టీడీపీ విశ్వ ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు తన వయస్సు లెక్క చేయకుండా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. దూరం అయిన వర్గాలను దరి చేర్చుకుంటున్నారు. అదే సమయంలో గత మూడేళ్లుగా బీజేపీ ప్రాపం కోసం చేయని ప్రతయ్నం లేదు. గత ఎన్నికల్లో బీజేపీని వ్యతిరేకించి మూల్యం చెల్లించుకున్న విషయం బాబుకు తెలుసు. అందుకే ప్రధాని మోదీ సాయం కోసం ఎడతెగని ప్రయత్నం చేశారు. ఇటీవల ఆ ప్రయత్నాలు కొలిక్కి వచ్చిన పరిస్థితులు కనిపించాయి. దీంతో చంద్రబాబు వేగంగా పావులు కదపడం ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహాత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీని చంద్రబాబు కలిశారు. వారి మధ్య మాటా మంతి పెరిగింది. అదే సమయంలో రాష్ట్ర బీజేపీ నేతల స్వరం సైతం మారింది. టీడీపీ పై విమర్శల జడివాన తగ్గించారు. వైసీపీపై పెంచారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిసే వెళుతుందని.. దాదాపు స్వీప్ చేస్తామని తెలుగు తమ్ముళ్లు కలలు గంటున్నారు. ఢిల్లీ వాతావరణం బాగుందన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి అమిత్ షా షాకిచ్చారు. టీడీపీకి దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమై కొత్త సంకేతాలిచ్చారు.

ప్రధాని చర్యలతో టీడీపీలో జోష్
ప్రధాని మోదీతో చంద్రబాబుతో సమావేశం పెద్ద దుమారమే రేపింది. బీజేపీకి బాబు దగ్గరవుతున్నారని ఆయన అనుకూల మీడియా ప్రచారం చేసింది. టీడీపీ నాయకులు కూడా సంబరాలు చేసుకున్నాయి. అయితే చంద్రబాబుకు అంత సీన్ లేదని.. ప్రధాని మోదీ నమ్మే స్థితిలో లేరని వైసీపీ నేతలు కొట్టిపారేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా సమావేశంపైనా కొడాలి నాని వంటి వారు విపరీత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. చంద్రబాబును నమ్మలేదు కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా సమావేశమయ్యారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో మునుగోడు సమావేశానికి హాజరైన అమిత్ షా పనిలో పనిగా వివిధరంగాల ప్రముఖులను హైదరాబాద్ లో కలిశారు. మీడియా అధినేత రామోజీరావుతో సమావేశమయ్యారు.
Also Read: Adani Bought NDTV: ఎన్డీటీవీ షేర్లు గౌతం అదానీ కొనడం వెనుక అసలు రహస్యమేంటి?
అటు తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో సైతం భేటీ జరిగింది. కానీ వాటన్నింటికీ లేని విధంగా కేవలం జూనియర్ ఎన్టీఆర్ తో భేటీకే రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలోకి ఆహ్వానించడానికైనా అయ్యుండాలి. లేకుంటే టీడీపీలో క్రియాశీలం చేయడానికి అయినా అయ్యుండాలి? లేదు మహారాష్ట్ర తరహాలో భవిష్యత్ లో చంద్రబాబుపై తిరుగుబాటు చేయడానికి సంసిద్దం చేసేందుకైనా అయి ఉండాలి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆ సమావేశంతో..
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టీడీపీలో సైతం యాక్టివ్ గా లేరు. అలాగని పార్టీకి దూరం అని ఏనాడు చెప్పలేదు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ను ఫోకస్ చేసే భాగంగానే చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. వాస్తవానికి 2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవిచూసింది. అటు తరువాత 2014 ఎన్నికలు జరిగినా జూనియర్ ప్రచారానికి రాలేదు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో కూడా ప్రచారానికి జూనియర్ దూరంగా ఉన్నారు. పార్టీ దారుణ ఓటమిని మూటగట్టుకుంది. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తేవాలన్న డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ టీడీపీకి స్నేహహస్తం అందించారని టీడీపీ సంబర పడుతున్న వేళ.. అమిత్ షా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమై ఆశలను నీరుగార్చారు.
Also Read:Rajasingh- Lawyer Karuna Sagar: రాజాసింగ్ తరుఫు న్యాయవాది సాగర్ సంచలన వ్యాఖ్యలు


[…] Also Read: Amit Shah- TDP: టీడీపీ ఆశలను నీరుగార్చిన అమిత్… […]