Amith Shah Operation Telangana: మోడీ-అమిత్‌షాల జోడీతో అనుకున్న లక్ష్యాలను సాధించారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ముద్ర ఉండాలనేది వారి అంతిమ లక్ష్యం. ఆ దిశగానే ఉత్తరాది నుంచి పశ్చిమ, అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోనూ పాగా వేశారు. యూపీలోనూ ఇప్పడు తిరుగులేని ఆధిపత్యం సాధించారు. అమిత్‌షా సోషల్ ఇంజినీరింగ్ మాయ చేసింది. ఏకపక్షంగా అధికారం దక్కింది. ఇప్పడు వారి టార్గెట్ దక్షిణాది రాష్ట్రాలు.

ఇందులో మొదటి వరుసలో ఉంది తెలంగాణ. నేరుగా హోంమంత్రి తెలంగాణలో పార్టీకి దిశా నిర్ధేశం చేస్తున్నారు. కేంద్రంతోపాటు, ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ రాజకీయం బాణం ఎక్కుపెట్టారు. దీంతో కేసీఆర్ సొంత రాష్ట్రంలోనే ఆత్మరక్షణలో పేడేసే వ్యూహంలో బీజేపీ ఉన్నట్టు అర్థమవుతోంది. ఇందుకు ముందస్తు వ్యూహంతో ముందుకు సాగుతోంది. కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని సీనియర్లకు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కిచ్చుకోవాలనే తపనతో కసరత్తులు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, బీజేపీపై అభిప్రాయాలు ఏంటనే వాటిపై సర్వేలు చేయిస్తున్నారు అమిత్ షా. ఆ నివేదికల ఆధారంగా పార్టీ సీనియర్లతో కొత్త వ్యూహాలు అమలు చేయాలని డిసైడ్ అయ్యారట. ఇందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉండి నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసి వారికి తెలంగాణలో నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తున్నారు.

ఒక్కోనేతకు మూడు నియోజకవర్గాల చొప్పున అప్పగిస్తున్నారు. సుమారు 30మంది ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ సభ్యులతో టీంలు తయారు చేస్తున్నారు. ఈ టీంలు తెలంగాణలో అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు అమిత్‌షా కార్యాలయానికి సమాచారం చేరవేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారట. మొత్తంగా ఢిల్లీ నుంచే తెలంగాణలో ఆయన ఆపరేషన్ కొనసాగించనున్నారన్నమాట.
తెలంగాణ పర్యటనలో యాక్షన్ ప్లాన్ , ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలా ? ముందుకు సాగాలి అనే అంశాలపై ఇప్పటికే రాష్ట్ర నేతలకు సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల మూడ్ ఏంటో తెలుసుకోవాలని బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భౄగంగానే సర్వే సంస్థలను కొన్నింటిని రంగంలోకి దించింది. వారి సర్వేలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలసిందట.
ఇదే సమయంలో బీజేపీ ఇబేజ్ పెరుగుతున్నదని సర్వేలో వెల్లడైందట. ఇక ఉగాది నుంచి పార్టీలో ఇతర పార్టీల నుంకచి చేరికలు ఉంటాయని చెప్పుకొస్తున్నారు. ముఖ్యనేతలు వరుసగా బీజేపీలో చేరతారని, ఒకేసారి కాకుండా సందర్భానుచితంగా చేరికలు ఉంటాయని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక బీజేపీ కోసం పనిచేసేందుకు ముందుకొచ్చే సీనియర్ నేతలు, మాజీ నేతలకు పార్టీల వ్యూహాల అమలు, నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారట. ఇప్పటికే 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాల్లో కార్యాచరణ నిమిత్తం అనుభవం ఉన్న సీనియర్‌నేతలు, మాజీ ఎంపీల నేతృత్వంలో రెండు ప్రత్యేక సమన్వయ కమిటీలను రాష్ట్ర పార్టీ నియమించిందని సమాచారం. ఇక ఈనెలలోనే అమిత్‌షా రాష్ట్ర పర్యటనలో భాగంగా రెండు రోజులపాటు ఆపరేషన్ తెలంగాణపైనే దిశానిర్ధేశం చేయనున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
[…] Also Read: Amit Shah Operation Telangana: ఆపరేషన్ తెలంగాణ షురూ చేసి… […]