https://oktelugu.com/

KCR vs BJP: కేసీఆర్ కు చెక్ పెట్టే బీజేపీ వ్యూహం: కీలక నేతలను ఢిల్లీకి పిలిచిన అమిత్ షా

KCR vs BJP: తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇక్కడ సీటు కోల్పోవడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కేంద్రంపై అస్త్రాలు ఎక్కుపెట్టారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని కేంద్రప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. రైతులను కేంద్రమే మోసం చేస్తోందని చెబుతూ ధర్నాలకు సైతం దిగుతున్నారు. అయితే బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకే కేసీఆర్ ఈ ప్లాన్ వేశారని కమలదళం అనుమానిస్తోంది. మరోవైపు తమ ఎంపీలతో పార్లమెంట్లో ఆందోళన […]

Written By:
  • NARESH
  • , Updated On : December 9, 2021 11:05 am
    Follow us on

    KCR vs BJP: తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇక్కడ సీటు కోల్పోవడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కేంద్రంపై అస్త్రాలు ఎక్కుపెట్టారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని కేంద్రప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. రైతులను కేంద్రమే మోసం చేస్తోందని చెబుతూ ధర్నాలకు సైతం దిగుతున్నారు. అయితే బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకే కేసీఆర్ ఈ ప్లాన్ వేశారని కమలదళం అనుమానిస్తోంది. మరోవైపు తమ ఎంపీలతో పార్లమెంట్లో ఆందోళన సైతం కేసీఆర్ చేయించారు. కేంద్రం తీరుకు నిరసనగా సమావేశాలను టీఆఎస్ ఎంపీలు బహిష్కరించారు. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలపై కేంద్రం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోంది. ఈ నేపథ్యంలో నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలను ఢిల్లీకి రావాలని బీజేపీ అధిష్టానం పిలవడం చర్చనీయాంశమైంది.

    KCR vs BJP

    kcr-amit-shah-

    గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు వచ్చినా ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలుపొందారు. ఆ తరువాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో కమలం పార్టీ విజయం సాధించింది. లెటేస్టుగా హుజూరాబాద్ స్థానాన్ని సొంతం చేసుకుంది. దీంతో ప్రస్తుతం తెలంగాణలో ఆ పార్టీకి నాలుగు ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇదే ఊపులో వచ్చే ఎన్నికల్లోకి వెళితే మరింత ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయిన పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా పార్టీని మరింత విస్తరించేందుకు ఇక్కడి నాయకులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తోంది.

    బీజేపీ పట్టు సాధించడంతో కేసీఆర్ తనదైన శైలిలో కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. కేంద్రం ధాన్యం కోనుగోళ్లు చేయడం లేదంటూ ఆందోళన చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తాము కూడా కొనే ప్రసక్తే లేదని కేసీఆర్ చెబుతున్నారు. ఇందులో భాగంగా యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని ప్రకటించారు. మరోవైపు టీఆర్ఎస్ నాయకులు సైతం బీజేపీ నాయకులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేశారు. ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. అయితే మంత్రి పీయూష్ గోయల్ ధాన్యం ధాన్యంపై వివరణ ఇవ్వడంతో.. కేంద్రం అబద్ధాలాడుతోందని సమావేశాలను బహిష్కరించారు.

    Also Read: ‘హరీష్’కు పెరిగిన ప్రాధాన్యం.. వ్యూహమేనా?

    ఈ నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను అధిష్టానం ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ఇందులో భాగంగా ఏడుగురు నాయకులను ఢిల్లీకి రావాలని అమిత్ షా తెలిపారు. భవిష్యత్ లో తెలంగాణలో పార్టీ పుంజుకునే అవకాశాలు ఉండడంతో ఇదే ఊపులో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గినా తెలంగాణలో దానిని భర్తీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వీరితో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశం అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.

    తెలంగాణలో వ్యూహాత్మకంగా ముందుకు సాగితే అధికారం కూడా చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తోందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. గతానికి భిన్నంగా తెలంగాణలో రాజకీయ వాతావరణం ఏర్పడింది. ప్రజలు ఎక్కువగా అధికార, ప్రతిపక్ష పార్టీల తీరుపై గమనిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై ఎక్కువగా పోరాడాలని సూచిస్తున్నారు. మరోవైపు పార్టీ ఇమేజ్ తగ్గకుండా ఇలాగే కొనసాగిస్తూ పటిష్టతకు కృషి చేయాలని సూచించే అవకాశం ఉంది.

    Also Read: ఈటల పాచిక.. అధికార పార్టీకి ఓటమేనా ఇక?