https://oktelugu.com/

Lockdown: తెలంగాణలో మరోసారి లాక్ డౌన్? ఈరోజు కేబినెట్ అత్యవసర భేటిలో నిర్ణయం?

lockdown In Telangana: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సీఎం కేసీఆర్ మరోసారి ఆంక్షల దిశగా ఆలోచిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. రోజు వారీ కేసులు రెండు వేలకుపైగా వస్తుండడం.. మరణాలు మళ్లీ పెరుగుతుండడంతో కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. ఈరోజు అత్యవసర కేబినెట్ భేటి నిర్ణయించారు. ఇప్పటికే విద్యాసంస్థల సెలవులను ఈనెల 30వరకూ పొడిగించిన కేసీఆర్ ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలకు సన్నద్ధమవుతోంది. ఈరోజు మధ్యాహ్నం ప్రగతిభవన్ లో రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటిని కేసీఆర్ నిర్ణయించారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 17, 2022 / 08:38 AM IST
    Follow us on

    lockdown In Telangana: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సీఎం కేసీఆర్ మరోసారి ఆంక్షల దిశగా ఆలోచిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. రోజు వారీ కేసులు రెండు వేలకుపైగా వస్తుండడం.. మరణాలు మళ్లీ పెరుగుతుండడంతో కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. ఈరోజు అత్యవసర కేబినెట్ భేటి నిర్ణయించారు. ఇప్పటికే విద్యాసంస్థల సెలవులను ఈనెల 30వరకూ పొడిగించిన కేసీఆర్ ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలకు సన్నద్ధమవుతోంది.

    lockdown:

    ఈరోజు మధ్యాహ్నం ప్రగతిభవన్ లో రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటిని కేసీఆర్ నిర్ణయించారు. ఈ భేటిలో సీఎం కేసీఆర్ ఈ మేరకు దిశానిర్ధేశం చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాత్రి తొమ్మిది గంటల తర్వాత నుంచి కర్ఫ్యూ విధించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విద్యాసంస్థల్లో సెలవులను పొడిగించిన ప్రభుత్వం సినిమా థియేటర్లు, మాల్స్ , ఇతర జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఆంక్షలను అమలు చేయాలని భావిస్తోంది.

    Also Read: ‘ఇస్మార్ట్’గా రెమ్యునరేషన్ పెంచేసిన నిధి అగర్వాల్..!

    కేసీఆర్ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం 2 గంటలకు జరిగే మంత్రి మండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే స్పీకర్ పోచారం సహా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వైరస్ బారినపడ్డారు. ఒమిక్రాన్ కేసులు పెరగడంపైనా ఆందోళన నెలకొంది.

    టీకాలు వేసుకోవడంతో చాలా మంది కోవిడ్ నిబంధనలు పట్టించుకోకపోవడం వల్లనే తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయనే భావన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. దీంతో ప్రజలు సంచరించే ప్రాంతాల్లో నియంత్రణ కోసం పలు చర్యలను చేపట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.

    కరోనా ఆంక్షలతోపాటు కరోనా పరీక్షలు ముమ్మరం చేయడం.. అర్హులందరికీ టీకాలివ్వడం.. ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచడం వంటి చర్యలపైనా మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది.. విద్యాసంస్థల్లో ఆన్ లైన్ తరగతుల ప్రారంభానికి కూడా అనుమతించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

    ఇప్పటికే తెలంగాణలో వైద్యరంగం పరిస్థితి ఆ శాఖ సమగ్ర నివేదికను రూపొందించింది. ఇక ఈ కేబినెట్ భేటిలో దళితబంధు నిధులు, పేదల ఇళ్లస్థలాల క్రమబద్దీకరణ, ఉద్యోగులకు డీఏ, కొత్త క్రీడావిధానం, అనాథల సంక్షేమం, వంటివి తెలంగాణ కేబినెట్ ఎజెండాలో ఉన్నాయి.

    ఇక ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగ ఖాళీల భర్తీపై కూడా తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిసింది. వచ్చే నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల దృష్ట్యా శాఖల వారీగా పద్దుల రూపకల్పనపైనా కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారని సమాచారం. ప్రధానంగా తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పెట్టి బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లపై ఆంక్షలు విధించేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

    ఇప్పటికే ఏపీలో మంగళవారం నుంచి నైట్ కర్ఫ్యూను అమల్లోకి తెస్తున్నారు. ఏపీతోపాటు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు అమలు చేశారు. ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ సర్కార్ ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి?

    Also Read: వర్మ హీరోయిన్‌ కు ‘అక్కడ’ చేదు అనుభవం..!