CM Jagan New Cabinet Portfolios ఏపీలో కొత్త మంత్రులు కొలువుదీరారు. జగన్ సీనియారిటీని.. అలాగే ఫైర్ బ్రాండ్లను ఈసారి తన అమ్ముల పొదిలో చేర్చుకున్నారు. ముఖ్యంగా మాటల తూటాలు పేల్చగల ఫేమస్ నేతలు రోజా, అంబటి రాంబాబు, జోగి రమేశ్ లు ఈసారి మంత్రులయ్యారు. రోజాకు హోంమంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.. ఎవరికి ఏం కేటాయిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. అందరికంటే ముందుగా తొలుత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం.. సీనియారిటీ ప్రకారం కాకుండా ‘ఆల్ఫాబెట్ ’ ప్రకారం వారి పేర్ల మొదటి అక్షర క్రమంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగడం విశేషం.
అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఫైర్ బ్రాండ్ రోజాకు పర్యాటకం, యువజన , సాంస్కృతిక శాఖ ఇచ్చారు. తొలి సారి మంత్రి అయినా కూడా యువ ఎమ్మెల్యే రజినీకి కీలకమైన వైద్య ఆరోగ్యశాఖను అప్పగించారు. ఎంతో కీలకమైన ఈ శాఖ ఆమె అనుభవం లేకుండా ఎలా నిర్వహిస్తారన్నది చూడాలి. ఇక భారీ నీటిపారుదల శాఖను తన సన్నిహితుడైన అంబటి రాంబాబుకు జగన్ కేటాయించారు.
-సీఎం జగన్ కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవీ
1-తానేటి వనిత-హోంశాఖ
2-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి-ఆర్థిక శాఖ, శాసనసభా వ్యవహారాలు
3-ధర్మాన ప్రసాదరావు-రెవెన్యూ,రిజిస్ట్రేషన్ శాఖ
4-ఆర్కే రోజా:- పర్యాటక సాంస్కృతిక, యువజన శాఖ
5-విడుదల రజినీ: వైద్యశాఖ
6-నారాయణ స్వామి-ఎస్సైజ్ శాఖ
7-అంబటి రాంబాబు:- భారీ నీటి పారుదల శాఖ
8-జోగి రమేశ్-గృహ నిర్మాణ శాఖ
9-బొత్స సత్యనారాయణ- విద్యాశాఖ
10-ఉషశ్రీ చరణ్-స్త్రీ శిశు సంక్షేమం
11-సీదిరి అప్పలరాజు-మత్స్య, సమకార శాఖ
12-అంజాద్ భాషా-: మైనార్టీ శాఖ
13-కొట్టు సత్యనారాయణ-దేవాదాయ శాఖ
14-పినిపె విశ్రూప్-: రవాణా శాఖ
15-మేరుగా నాగార్జున-సాంఘిక సంక్షేమ శాఖ
16-ముత్యాల నాయుడు:-పంచాయితీరాజ్
17-పీడిక రాజన్న దొర-: గిరిజన సంక్షేమ శాఖ
18-దాడిశెట్టి రాజా-రోడ్లు, భవనాల శాఖ
19-పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి:-విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ
20-చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ: సాంఘిక సంక్షేమ శాఖ
21-ఆదిమూలపు సురేష్: మున్సిపల్, అర్బన్ డెవలప్ మెంట్
22-గుమ్మనూరు జయరాం:- కార్మిక శాఖ
23-గుడివాడ అమరానాథ్: పరిశ్రమలు, ఐటీశాఖ
24-కాకాణి గోవర్ధన్ రెడ్డి : వ్యవసాయ శాఖ
25. వేణుగోపాల్ : బీసీ సంక్షేమం సినిమాటోగ్రఫీ, సమాచార పౌరసంబంధాల శాఖ
గతంలో లాగానే ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. మైనార్టీ నుంచి అంజాద్ బాషాకు డిప్యూటీ సీఎం గా ఎంపిక చేశారు. ఎస్టీ వర్గం నుంచి పీడిక రాజన్న దొర, ఎస్సీ నుంచి నారాయణ స్వామి డిప్యూటీ సీఎంలుగా నియమించారు. ఇక బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణలకు ఆయా సామాజిక సమీకరణాల ఆధారంగా డిప్యూటీసీఎం పదవులు కేటాయించారు.
ఇక మంత్రి పదవి ఇన్నాళ్లు అనుభవించి ఇప్పుడు దక్కకపోవడంతో అసంతృప్తి జ్వాల ఎగిసిపడింది. బాలినేని అసంతృప్తి వ్యక్తం చేయడంతో సీఎం జగన్ స్వయంగా పిలిపించారు. బాలినేని కొద్దిసేపటి క్రితమే జగన్ వద్దకు వెళ్లారు. ఇప్పటికే వైసీపీలో మొన్నటివరకూ హోంమంత్రిగా చేసిన మేకతోటి సుచరిత తాజాగా తనకు పదవి దక్కలేదని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరికొంత మంది మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోగా.. ఇంకొందరు అభిమానులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో కొత్త కేబినెట్ తో జగన్ కు కొత్త తలనొప్పులు వచ్చాయని అంటున్నారు.