AP BJP Political Alliance: ఏపీలో జనసేనను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందా? పవన్ ను సీఎం అభ్యర్థిగా వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారా? మిత్రపక్షాన్ని బీజేపీ అవమానించడం వెనుక అధికార పార్టీ వైసీపీ పాత్ర ఉందా? ఏపీలో జనసేన కంటే వైసీపీ సహకారమే కీలకమని కేంద్ర పెద్దలు భావిస్తున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. జనసేనను కార్నర్ చేస్తూ.. రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా భారతీయ జనాతా పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై జనసైనికులు అంతర్మథనం చెందుతున్నారు. అదును చూసి బీజేపీ తమను దెబ్బ కొట్టిందని తెగ బాధపడుతున్నారు. అసలు రాష్ట్రంలో ఉనికే లేని బీజేపీకి జవసత్వాలు నింపింది పవన్ కాదా అని ప్రశ్నిస్తున్నారు. విభజన హామీలు తీర్చక ఏపీని అన్యాయం చేసిందన్న కోపం ఏపీ ప్రజలకు ఉన్నా.. పవన్ లెక్క చేయకుండా బీజేపీతో చెలిమి చేశారు. ప్రధాని మోదీ సమర్థవంతమైన నేతగా చెప్పుకొచ్చారు. అంతలా నమ్మిన పవన్ ను బీజేపీ కాదనడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవానికి జనసేనతో పోల్చుకుంటే బీజేపీ పాత్ర రాష్ట్రంలో అంతంతే. బీజేపీకి నాయకులు ఉన్నా పవన్ అంత చరిష్మ ఎవరికీ లేదనడంలో అతిశయోక్తి లేదు. కాబోదు. బీజేపీ కేంద్ర నాయకులు ఏపీకి వచ్చినా కాస్త జనం రావాలంటే పవన్ కల్యాణ్ రావాలి. లేకపోతే జన సమీకరణ చేయడానికి బీజేపీ నేతలు వ్యయప్రయాసలు ఓర్చాల్సిందే.

పట్టని అగ్రనేతలు
వాస్తవానికి రాష్ట్ర బీజేపీ పెద్దలతో పనిలేదని.. తనకు కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయంటూ పవన్ ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. తన మాటల్లో సైతం జనసేనతో పాటు బీజేపీ నేతల ప్రస్తావన తీసుకొస్తుంటారు. అయితే ఢిల్లీ పెద్దలు మాత్రం పవన్ అంతరంగాన్ని గుర్తించలేకపోయారు. ఇటీవల ఏపీకి వస్తున్న ఢిల్లీ పెద్దలు పవన్ ను పట్టించుకోవడం లేదు. జేపీ నడ్డా ఏపీకి వచ్చి జనసేన పేరు కూడా ప్రస్తావించలేదు. పొత్తులో ఉన్న పార్టీకి కనీస గౌరవ మర్యాదలు ఇవ్వలేదు. బీజేపీ రావాలి.. వైసీపీ పోవాలి అని నినాదం ఇచ్చారు కానీ.. బీజేపీ – జనసేన రావాలని ఆయన పిలుపునివ్వలేదు. ఇది బలమైన మిత్రపక్షాన్ని అవమానించడమేనన్న చర్చ జరుగుతోంది. బీజేపీ నేతల తీరుపై జన సైనికులు ఆగ్రహంతో ఉన్నారు.
Also Read: Rushi Raj YCP Strategist: పీకే పోయి.. రుషిరాజ్ వచ్చే.. వైసీపీకి కొత్త వ్యూహకర్త
ఉన్నట్టుండి దూరం ఎందుకో?
జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఇప్పటిది కాదు. గడిచిన ఎన్నికల నాటి నుంచే రెండు పక్షాలు కలిసి నడుస్తున్నాయి. అటువంటిది ఉన్నట్టుండి జనసేనను బీజేపీ దూరం పెడుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. అసలు బీజేపీతో జనసేన పొత్తులో ఉందా లేదా అన్నట్లుగా బీజేపీ నేతలందరూ మాట్లాడుతున్నారు. పొత్తు పెట్టుకున్న మొదట్లో పవన్ కల్యాణ్ ఉద్దృతంగా కార్యక్రమాలు నిర్వహించేవారు. అమరావతి ఉద్యమంలో లీడ్ తీసుకున్నారు. అయితే హఠాత్తుగా బీజేపీతో పొత్తు ప్రకటించారు. దీంతో రెండు పార్టీలు ఏం చేసినా కలిసి పనిచేస్తాయన్నట్లుగా మొదట్లో మాట్లాడుకున్నారు. కలిసి పని చేయాలన్న రూల్ కారణంగా జనసేన ప్రజల్లోకి వెళ్లలేకపోయింది. తీరా అసలు సమరం దగ్గరకు వచ్చే సరికి పవన్‌ను బీజేపీ డంప్ చేస్తోంది. కనీసం జనసేన పును కూడా ఆ పార్టీ అగ్రనేతలు ప్రస్తావించడానికి సిద్ధపడటం లేదు. అయితే పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ బీజేపీ కోపానికి కారణంగా తెలుస్తోంది. నిజానికి గతంలోనే బీజేపీ పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. తిరుపతి ఉపఎన్నికల సమయంలోనే హైకమాండ్ సూచనలతోనే సోము వీర్రాజు ఈ ప్రకటన చేశారు. ఇప్పుడు అలా ప్రకటించే అవకాశం లేదని చెబుతున్నారు. నిజానికి ఎలా చూసినా.. రెండు పార్టీల్లో సీఎం అభ్యర్థిగా ఒకటి నుంచి పది స్థానాల్లో పవనే ఉంటారు. అలాంటప్పుడు ప్రకటించాడనికి ఇబ్బందేమిటన్నది జన సైనికుల వాదన?

పొత్తు ఒకరితో..స్నేహం మరొకరితో
ఏపీలో బీజేపీ అధికారికంగా జనసేనతో పొత్తులో ఉండవచ్చు కానీ.. అనధికారికంగా వైసీపీతో రాజకీయం చేస్తోంది. ఆ పార్టీకి ఎక్కడా లేనంత సహకారం అందిస్తోంది. సీఎం జగన్ నుంచి ఆ పార్టీ నాయకులకు కీలక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధాని, హోమ్ మంత్రిని కలిసేందుకు ఇట్టే అనుమతి లభిస్తోంది. ఈ క్రమంలో జనసేన కన్నా వైసీపీ సహకారమే బెటరని బీజేపీ డిసైడయినట్లుగా కనిపిస్తోందంటున్నారు. తిరుపతి ఉపఎన్నిక , స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జనసేన బీజేపీల మధ్య అంతరం పెరిగిపోయింది. బద్వేలు ఉపఎన్నిక.. ఇప్పుడు ఆత్మకూరు ఉపఎన్నికతో వారి మధ్య దూరం మరింత పెరిగినట్లుగా కనిపిస్తోంది. చివరికి అధికారికంగా పొత్తులున్నాయి.. అనధికిరంగా ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్థితి దాపురించింది. ఫైనల్‌గా ఇద్దరి మధ్య పొత్తు వికటించిందన్న నిర్ణయానికి రెండు పార్టీల క్యాడర్ వచ్చేసింది.
Also Read:YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు: జగన్ కు ఏదో ఉచ్చు బిగిస్తున్న సీబీఐ