Alla Ramakrishna Reddy- Narayana: తొలుత అమరావతిని భ్రమరావతి అన్నారు. అసలు నిర్మాణాలే జరగలేదన్నారు. కాదు కాదు బినామీలున్నారని చెప్పారు. అక్రమాలు జరిగిపోయాయని ఒక్కి నొక్కానించి చెప్పారు. కేసులు పెట్టారు. చంద్రబాబుతో సహా కీలక నాయకులపై కేసులు పెట్టారు. టీడీపీ హయాంలో పదవులు నిర్వర్తించిన వారికి భయపెట్టారు. చివరికి… సుప్రీంకోర్టు దాకా వెళ్లి భంగపడ్డారు. అయినా వారిలో ఆరాటం తగ్గడం లేదు. ఈసారి ఏకంగా… వెయ్యని ఇన్నర్ రింగ్గు రోడ్డును అడ్డం పెట్టుకుని చంద్రబాబును ‘ఏ1’గా చేర్చుతూ కేసు పెట్టేశారు. నాటి కేసులకూ, నేటి కేసుకూ మూలం వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదులే కావడం విశేషం. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు మొదలైనప్పటి నుంచే ఆయన పలు ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. ఆ ఆరోపణలేవీ నిలబడలేదు.

ఇప్పుడు… మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయని ఆళ్ల మరో ఫిర్యాదు చేశారు. నిజానికి… అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని నగర నిర్మాణానికి సింగపూర్‌కు చెందిన ప్రభుత్వ సంస్థ మాస్టర్‌ప్లాన్ ఇచ్చింది. ఆ తర్వాత రాజధాని నగర ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) కోసం సీఆర్‌డీఏ ఇంచుమించు ఆరు నెలలకు పైగా సంప్రదింపులు జరిపింది.జాతీయ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ)తో పాటు వివిధ గ్రామాల ప్రజల అభిప్రాయాలను తీసుకుంది. మొత్తం 97.5 కిలోమీటర్ల పొడవున ఐఆర్‌ఆర్ నిర్మించేందుకు ప్రతిపాదించింది. ఐఆర్‌ఆర్ వల్ల విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది.
Also Read: Chandrababu To Jail: చంద్రబాబును జైలుకు పంపడం జగన్ కు సాధ్యం అవుతుందా? సవాల్లేమిటీ?
అలానే గన్నవరం విమానాశ్రయానికి సులువుగా చేరుకోవచ్చు. మొత్తం రింగురోడ్డులో 67.5 కిలోమీటర్లు గ్రీన్‌ఫీల్డ్ కాగా.. ఎన్‌హెచ్-65ని 15 కిలోమీటర్లు, ఎన్‌హెచ్-16ని మరో 15 కిలోమీటర్లు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. టీబీడీ అనే సంస్థ మొత్తం అధ్యయనం జరిపి డీపీఆర్‌ను రూపొందించి సీఆర్‌డీఏకి నివేదించింది. భూసేకరణ, రోడ్డు అభివృద్ధి కలిపి రూ.6,878 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. నిజానికి ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్ పూర్తి పారదర్శకంగా చేశారు. దాదాపు 1100 మందిని సంప్రదించి వారి అభిప్రాయాలు క్రోడీకరించి రూపొందించారు. అటువంటి నివేదికలో లోపాలున్నాయని.. సంస్థల ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోపించడాన్ని రాజధాని ప్రజలు నివ్వెరపోతున్నారు.

రాజధాని ప్రకటన ముందే..
ఇన్నర్ రింగు రోడ్డు అలైన్‌మెంట్ మార్పుతో రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్‌ఈపీఎల్ ప్రాజెక్టు, లింగమనేని అగ్రికల్చర్ ఫామ్స్, జయని ఎస్టేట్స్‌కు లబ్ధి కలిగించారని ఆరోపించారు. రాజధాని ప్రకటనకు ముందే రాజధాని వెలుపల లింగమనేని, జయని ఇన్‌ఫ్రా, గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో కంతేరు వద్ద హెరిటేజ్ భూములు కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ భూములకు నష్టం కలగకుండా ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చారన్నది ఆయన అభియోగం. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్‌హెచ్-16పై చినకాకాని నుంచి గుండుగొలను వరకు విజయవాడ బైపాస్ రోడ్డును ఎన్‌హెచ్‌ఏఐ మంజూరు చేసింది. దీనికి అమరావతి రాజధాని రాకముందే మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని రైతులు భూములు కూడా ఇచ్చారు. ఈ బైపాస్ తో అనుసంధానం చేస్తూ ఐఆర్‌ఆర్‌ను రూపొందించారు. అయినా ఆళ్ల నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని నగర భూసేకరణ, భూసమీకరణ సందర్భంలోనూ నాటి మంత్రి నారాయణ పాల్గొన్న సభల వద్దకు ఆళ్ల వెళ్లి అడ్డుపడ్డారు. అప్పట్లో ఆయన తమ విధులకు ఆటంకం కలిగించారని అధికారులు పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు. మంత్రి ఆదేశాల మేరకే తనపై కేసులు పెట్టారని అప్పటి నుంచి ఆయన కక్ష పెంచుకున్నారని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. . నారాయణపై ప్రతీకారం తీర్చుకునేందుకే అసంబద్ధ ఆరోపణలతో సీఐడీకి ఫిర్యాదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒకే రోజు ఫిర్యాదులు..
వాస్తవానికి చంద్రబాబు, పి.నారాయణలపై ఫిర్యాదులన్నీ ఒకే రోజు చేయడం ద్వారా వ్యూహాత్మకంగా.. ఇరికించాలన్న కోణంలో ముందుకు సాగినట్టు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చినట్లు సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. అదే రోజు ఉదయం పదో తరగతి పరీక్ష తెలుగు ప్రశ్నపత్రం లీకైంది. మీడియా, ప్రతిపక్షాలు పేపర్ లీకేజీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో జగన్ ప్రభుత్వం అదే రోజు ఆళ్లతో ఫిర్యాదు చేయించినట్లు తెలుస్తోంది. పేపర్ లీకేజీపై చిత్తూరు జిల్లా డీఈవో సైతం అదే రోజు చిత్తూరు వన్ టౌన్‌లో మధ్యాహ్నం 1.50కి ఫిర్యాదు చేశారు. అంటే ప్రజలను డైవర్టు చేసేందుకు ఒక మైండ్ గేమ్ ఆడినట్టు తేటతెల్లమవుతోంది.
Also Read:Gadapa Gadapaku YCP: గడపగడపకు వెళ్లలేం.. అధికార వైసీపీ నాయకుల్లో వణుకు..
[…] […]