Ali- Janasena: ఏపీలో వైసీపీ నేతలు పిల్ల చేష్టలకు దిగుతున్నారు. ఎంతలా అంటే సినీ నటుడు అలీ జనసేనలో చేరలేదంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసేదాక. గత ఎన్నికల ముందు అలీ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు.గుంటూరు, రాజమండ్రిలో ఎక్కడో ఓ చోట సీటు దక్కుతుందని భావించారు. కానీ జగన్ హ్యాండిచ్చారు. అలాగని టీడీపీలోకి రీ ఎంట్రి ఇద్దామంటే కుదరలేదు. ఎలాగూ పార్టీలో చేరాము కదా అని గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. పార్టీ అనూహ్య విజయం సాధించింది. దీంతో తనకు నామినేటెడ్ పోస్టు ఖాయమని అలీ భావించారు. అదిగో గుడ్ న్యూస్.. ఇదిగో గుడ్ న్యూస్ అంటూ దాదాపు నాలుగేళ్లు దాటించేశారు. అయితే ఒక్క అలీకే కాదు. తనతో పాటు వైసీపీకి ఒత్తాసు పలికిన మోహన్ బాబు, పోసాని కృష్ణమురళీలకు కూడా రిక్త హస్తమే చూపించారు. థర్టీ ఈయర్స్ పృధ్వీకి టీడీపీ చానల్ చైర్మన్ చేసినా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఆయనపై ఆరోపణలు రావడంతో పక్కన పడేశారు. అయితే వైసీపీలో మంత్రులు,కీలక నేతలపై వచ్చిన ఆరోపణలతో చూసుకుంటే పృధ్వీది చిన్నదే. అయినా వేటు వేశారు. ఇలా మొత్తానికి సినిమా వాళ్లపై దెబ్బేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అలీకి వక్ఫ్ బోర్డుచైర్మన్ ఇస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ వైసీపీకి చెందిన సీనియర్ మైనార్టీ నాయకుడికి కట్టబెట్టారు. తరువాత రాజ్యసభ స్థానానికి అలీ పేరు పరిశీలిస్తున్నారని లీక్ చేశారు. దీంతో అలీ ఉబ్బితబ్బిబ్బయ్యారు.
Also Read: Asiatic Lion: సొంత రాష్ట్రంలో సింహాలపై మోడీకి ఎందుకు అంత చిన్న చూపు?
నేరుగా తన సతీమణిని వెంటబెట్టుకొని తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి సీఎం జగన్ ను కలుసుకున్నారు. అటు నుంచి వస్తూ వస్తూ వారం రోజుల్లో సీఎం శుభవార్త చెబుతానని చెప్పారని అలీ మీడియాకు వెల్లడించారు. అయితేవారాలు దాటుతున్నా శుభవార్త ఇంతవరకూ అలీ చెవిలో పడలేదు. తరువాత రాష్ట్రస్థాయిలో ఒక నామినేటెడ్ పోస్టు అలీకి కేటాయించారని ప్రచారం సాగింది. ఒక్క అలీకైతే తప్పుడు సంకేతాలు వెళతాయని పోసాని కృష్ణమురళీ పేరు ను సైతంతెరపైకి తెచ్చారు. అతడికి కూడా పదవి ఖాయమని చెప్పారు. కానీ పదవీ లేదు ప్రకటనా లేకుండా పోయింది.

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంది. ఇంకా ఉన్నది ఒక్క ఏడాదే. ఇప్పుడు పదవి వచ్చినా ఏం లాభం అనుకున్నారో ఏమో.. అలీ తన మనసులో మాటను వైసీపీ పెద్దలకు చెప్పారు. తనకు ఎమ్మెల్యే పదవి చేపట్టాలని ఉందని.. గుంటూరు కానీ రాజమండ్రి కానీ చాన్స్ ఇవ్వాలని కోరారు. అయితే ఇప్పటికే అక్కడ సిట్టింగ్ లు ఉన్నారని.. ఇవ్వడం కుదరదని తేల్చేశారు. దీంతో అలీకి తత్వం బోధపడింది. అదే సమయంలో రాజమండ్రిలో జనసేనకు గెలిచే చాన్స్ ఎక్కువ ఉందని అలీ తెలుసుకున్నారు. అటువైపు అడుగులు వేయడం ప్రారంభించారు. దీంతో అలీ జనసేనలో చేరడం ఖాయమని స్పష్టమైంది. ఇది వైసీపీకి కలవరపాటుకు గురిచేసింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అలీ పేరుతో ఒకప్రెస్ నోట్ రిలీజ్ అయ్యింది. తాను జనసేనలో చేరడం లేదన్నది మెయిన్ పాయింట్ కాగా.. మైనార్టీలకు ఇంతకు ముందున్న ఏ సీఎం చేయనిది జగన్ చేశారని మరో రోటీన్ పాయింట్. అయితే వైసీపీ నేతల హడావుడి చూస్తుంటే అలీకి ఏదో నామినేషన్ పోస్టు కేటాయించి జనసేనకు వెళ్లకుండా తాత్కాలికంగా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారని మాత్రం తెలుస్తోంది.
Also Read: YSRCP Candidates: వైసీపీలో అభ్యర్థులు ఫైనల్.. ఆ లిస్ట్ ఇదే.. ఎమ్మెల్యేగా ఎంపీ
[…] […]