వైసీపీ ఎమ్మెల్యేగా వెలుగు వెలిగిన అఖిల ప్రియ టీడీపీలో చేరింది. చంద్రబాబు ఆదిలోనే ఆమెను అందలమెక్కించారు. ఏకంగా చిన్న వయసులోనే మంత్రిని చేశారు. దీంతో ఇక నాకు తిరుగులేదనుకొని అందరితో గొడవలు, కొట్లాటలు పెట్టుకుంది. కిడ్నాపులు, దాడుల వరకు వెళ్లింది. నాడు అధికారంలో ఉండడంతో ఏం కాలేదు. కాపాడుకుంది.
కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. దీంతో బాధితులు కేసులు పెట్టడంతో వరుసగా కేసులు నమోదవుతున్నాయట.. కర్నూలులో ఇప్పుడు భూమా అఖిలప్రియ ఆస్తి గొడవలతో సొంత బంధువులు కూడా ఆమెపై కేసులు పెడుతున్నారట..
ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో అఖిలప్రియ బుక్కైంది. జైలుకు వెళ్లొచ్చింది. ఇక అఖిలప్రియతో లాభం కంటే నష్టమే ఎక్కువ అని తెలిసి చంద్రబాబు దూరం పెట్టాడట.. కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదట.. కలిసేందుకు వస్తున్నా రానీయడం లేదట..
ఇక కర్నూలు జిల్లా నేతలు అఖిలప్రియతో మాట్లాడడంలేదట.. టీడీపీ జిల్లా కార్యాలయంలో అఖిలప్రియ మీడియా సమావేశం పెడుదామన్నా కూడా నిరాకరిస్తున్నట్టు సమాచారం. ఇలా అఖిలప్రియకు ఇప్పుడు టీడీపీలో షాకుల మీద షాకులు తగులుతున్నాయట..