https://oktelugu.com/

Air Train: దేశంలో మరో కొత్త రైలు.. త్వరలో ప్రారంభించనున్న మోదీ.. ప్రత్యేకతలు ఇవే..

ప్రపంచ రైల్వే వ్యవస్థలో ఐదో స్థానంలో ఉంది ఇండియన్‌ రైల్వే. శతాబ్దాల క్రితమే రైల్వే భారత దేశంలో రైల్వే వ్యవస్థ ఉంది. వందలాది రైళ్లు ప్రయాణికులతోపాటు సరుకు రావాణా చేస్తున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 30, 2024 4:04 pm
    Air Train

    Air Train

    Follow us on

    Air Train: భారత దేశంలో రైల్వే వ్యవస్థ చాలా పురాతనమైంది. బ్రిటిక్‌ కాలంలోనే దేశంలో రైల్వే వ్యవస్థ మొదలైంది. 1890లో బ్రిటిష్‌ పాలకులు తమ అవసరాల కోసం రైలు మార్గం నిర్మించారు. క్రమంగా విస్తరించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం కూడా రైల్వే వ్యవస్థను విస్తరించింది. నిత్యం లక్షల మందికి రైల్వే ప్రధాన రవాణా సాధనం. కాలక్రమేణా ఇండియన్‌ రైల్వే అనేక కొత్త రైళ్లను ప్రవేశపెడుతూ రైల్వేను ఆధునికీకరిస్తూ.. కొత్త రైలు మార్గాలు నిర్మిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే రాజధాని, శతాబ్ది, వందేభారత్, వందే మెట్రో, వందే సాధారణ్‌ పేరులో అనేక రైళ్లను కేంద్రం ప్రవేశపెట్టింది. ఇక త్వరలోనే హైడ్రోజన్‌ రైళ్లను పట్టాలెక్కించే పనిలో ఉంది కేంద్రంలోని మోదీ సర్కార్‌. 2025 చివరి నాటికి బుల్లెట్‌ రైలును కూడా పట్టాలెక్కించాలన్న సంకల్పంతో ఉంది. పూరిత్గా దేశీయ పరిజ్ఞానంతో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఇంజిన్లను తయారు చేయబోతోంది. ఇదే సమయంలో మరో కొత్త రైలు తెచ్చే ప్రయత్నం చేస్తోంది.

    ఎయిర్‌ ట్రైన్‌..
    కొత్తగా తెచ్చే రైలును ఆటోమేటెడ్‌ పీపుల్‌ మూవర్‌–ఏపీఎం సర్వీసుగా వ్యవహరించే ఈ ఎయిర్‌ ట్రైన్‌ న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభం కాబోతోంది. మిమానాశ్రయంలో ఉన్న మూడు టెర్మినళ్లకు వెళ్లేందుకు లేదంటే విమానాన్ని డీబోర్డింగ్‌ చేసిన తర్వాత క్యాబ్‌ కోసం సర్వీస్‌ను అందుబాటులో ఉంచనుంది. అయితే ఇక్కడ సమయం చాలా ఎక్కువ పడుతుంది. రద్దీగా ఉండే విమానాశ్రయం. ఏడు కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

    ఆలస్యాన్ని నివారించేందుకు
    విమానాశ్రయంలో ఒక టెర్మినల్‌ నుంచి మరో టెర్మినల్‌కు ప్రయాణికులు వెళ్లే సమయంలో ఆలస్యాన్ని నివారించేందుకు ఈ ఎయిర్‌ ట్రైన్‌ తీసుకురాబోతున్నారు. ఇది మెట్రో తరహాలో డ్రైవర్‌ లేకుండా పనిచేస్తుంది. రూ.2 వేల కోట్ల రూపాయలతో దీనిని ప్రారంభించబోతున్నార. 2027 నాటికి ఈ రైలు అందుబాటులోకి వస్తుంది. తక్కువ బోగీలు ఉండి ట్రాక్‌పై నడుస్తుంది. విమానాశ్రయంలో హోటళ్లు, క్యాబ్‌ ఎక్కే పాయింట్లు, పార్కింగ్, ఇతర టెర్మినల్స్‌ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. వేగంగా తీసుకెళ్తుంది. నాలుగు స్టాపులతో 7.7 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేస్తుంది. దీని కోసం ఈ ఏడాది చివరన టెండర్లు పిలవాలని కేంద్రం నిర్ణయించింది.