https://oktelugu.com/

68ఏళ్ల తర్వాత తిరిగి టాటా సన్స్ చేతికి ఎయిరిండియా

కేంద్ర ప్రభుత్వ అనుబంధంగా సాగిన ఎయిరిండియా విమానాయాన సంస్థను బిడ్డింగ్ ద్వారా టాటా సన్స్ దక్కించుకుంది. ఇప్పటికే 43 వేల కోట్ల నష్టాలతో ఎయిరిండియా నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయానలి భావించింది. అనుకున్నట్లుగానే బిడ్డింగ్ నిర్వహించింది. బిడ్డింగ్ సందర్భంగా దేశీయ దిగ్గజ సంస్థ టాటా సన్స్ ఈ బిడ్డింగ్ ను దక్కించుకుంది. ఎయిరిండియా సంస్థ కోసం నిర్వహించిన బిడ్డింగ్ లో టాటాసన్స్ మరియు మరో విమానాయాన సంస్థ స్పెస్ జెట్ కూడా పోటీ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 1, 2021 5:40 pm
    Follow us on

    కేంద్ర ప్రభుత్వ అనుబంధంగా సాగిన ఎయిరిండియా విమానాయాన సంస్థను బిడ్డింగ్ ద్వారా టాటా సన్స్ దక్కించుకుంది. ఇప్పటికే 43 వేల కోట్ల నష్టాలతో ఎయిరిండియా నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయానలి భావించింది. అనుకున్నట్లుగానే బిడ్డింగ్ నిర్వహించింది. బిడ్డింగ్ సందర్భంగా దేశీయ దిగ్గజ సంస్థ టాటా సన్స్ ఈ బిడ్డింగ్ ను దక్కించుకుంది. ఎయిరిండియా సంస్థ కోసం నిర్వహించిన బిడ్డింగ్ లో టాటాసన్స్ మరియు మరో విమానాయాన సంస్థ స్పెస్ జెట్ కూడా పోటీ పడింది.

    అయితే చిరవకు ఈ పోటీలో టాటా సన్స్ నిలిచి బిడ్డింగ్ ను గెల్చుకుంది. ఇక టాటా సన్స్ చేతికి ఎయిరిండియా వెళ్లడంతో కచ్చితంగా లాభాల బాటలో పయనిస్తుందని పలువురు మార్కెట్ అనలిస్టులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర్యానికి ముందు ఎయిరిండియా విమానాలకు టాటా సంస్తే నిర్వహించేది. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ సంస్థను జాతీయం చేశారు.

    ఇక తాజాగా టాటా సన్స్ ఎయిరిండియా బిడ్ ను దక్కించుకోవడంతో 67 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ దక్కించుకున్నట్లయ్యింది.  డిసెంబర్ నాటికి ఎయిరిండియా సంస్థ టాటా చేతిలోకి అధికారికంగా వెళ్లనుంది. ఎయిరిండియాలో కేంద్ర ప్రభుత్వం 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకుంది. దీంతో అతిపెద్ద ప్రభుత్వ ఉపసంహరణ ప్రక్రియగా నిలిచింది. ఇక బిడ్డింగ్ ముగిసిందని టాటా సన్స్ కు బిడ్డింగ్ దక్కిందని ఓ అధికారి చెప్పారు. అయితే మంత్రుల బృందం దీన్ని అధికారికంగా ఆమోదం తెలుపుతుందని ఆయన చెప్పారు. అయితే ఇది కేబినెట్ ఆమోదం పొందాల్సిన అవసరం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు.