UP Election 2022 Result: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. కానీ దాని వెనుక ఓ కథే నడిచిందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. బీజేపీకి పరోక్షంగా ఎంఐఎం సాయం చేసిందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. గతంలో కూడా బీహార్ లో జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడంతో బీజేపీ దాని మిత్ర పక్షాలు బ్రహ్మాండమైన మెజార్టీ సాధించాయి. అక్కడ కూడా బీజేపీ గెలుపుకు పరోక్షంగా ఎంఐఎం కారణం అయిందనే వాదనలు వచ్చాయి. యూపీలో మాత్రం బీజేపీకి సాయం చేసింది ఎంఐఎం అనే వారి సంఖ్య పెరుగుతోంది. లెక్కలతో సహా వారు నిరూపిస్తున్నారు.

బీజేపీకి ఎంఐఎం చేదోడు వాదోడుగా నిలుస్తోందనేది అభియోగం. ఎన్నికలకు ముందు కూడా ఇదే అభిప్రాయం అందరిలో వ్యక్తమైంది. ఎంఐఎం పోటీ చేస్తే ఓట్ల శాతం చీలి బీజేపీకే ప్రయోజనం చేకూరుతుందని పలువురు వాదించారు. కానీ ఇందులో వాస్తవం లేదని బీజేపీ నేతలు కొట్టిపారేశారు. మరోవైపు ఎంఐఎం నేతలు కూడా ఇదంతా అభూత కల్పన అని విమర్శించారు. కానీ ఆధారాలు చూస్తుంటే ఇదే నిజమేమో అనే అనుమానం అందరిలో వస్తోంది.
Also Read: ఈసారి కేసీఆర్ మునుగోడు నుంచే పోటీకి దిగుతారా?
యూపీలో దాదాపు వంద సీట్లలో కేవలం రెండు వేల కంటే తక్కువ మెజార్టీతో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. అంటే దళితులు, ముస్లింల ఓట్లు చీలడంతో ఎస్పీకి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అందుకే ఎంఐఎం బీజేపీకి సహకరిస్తోందని సంశయాలు వ్యక్తం చేస్తున్నారు. 200 ఓట్ల తేడాతో ఏడు సీట్లు, 500 ఓట్ల తేడాతో 23 సీట్లు, వెయ్యి ఓట్ల తేడాతో 49 సీట్లు, రెండు వేల ఓట్ల తేడాతో 21 సీట్లు బీజేపీ గెలుచుకుందని చెబుతున్నారు.

దేశమతా యూపీ ఎన్నికల ఫలితాలపైనే దృష్టి సారించింది. ఈ మారు బీజేపీకి విజయం అంత సులువు కాదనే అభిప్రాయం అందరిలో వచ్చింది. కానీ అనూహ్యంగా బీజేపీ పుంజుకుని బ్రహ్మాండమైన మెజార్టీ సాధించి అందరి అంచనాలు తలకిందులు చేసింది. ఇందుకు ఎంఐఎం సహకారం అందించిందనే వాదనలు వస్తున్నాయి. కానీ ఇందులో నిజం లేదని బీజేపీ నేతలు బుకాయిస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ బీజేపీకి ఏజెంటుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి కాగల కార్యం గంధర్వులే తీర్చారనే సామెతలాగే ఎంఐఎం బీజేపీకి బాటలు వేసిందని అందరిలో అనుమానాలు నెలకొన్నాయి.
Also Read: హిజాబ్ పై తీర్పు: చంపేస్తామంటూ కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ కు బెదిరింపు
Recommended Video: