Homeజాతీయ వార్తలుTelangana BJP: వచ్చేటోళ్లు ఆగిపోయే.. పోయేటోళ్లు ఎక్కువాయే.. బీజేపీకి ఏమైంది?

Telangana BJP: వచ్చేటోళ్లు ఆగిపోయే.. పోయేటోళ్లు ఎక్కువాయే.. బీజేపీకి ఏమైంది?

Telangana BJP: భారతీయ జనతా పార్టీ… తెలంగాణలో రెండేళ్లుగా మంచి దూకుడు మీద ఉంది. అధికార బీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటూ వచ్చింది. బండి సంజయ్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ అనూహ్యంగా పుంచుకుంది. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ అధికార పార్టీని ఓడించినంత పని చేసింది. దీంతో బీజేపీలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపారు.

బడా నేతల చేరికలు..
కేంద్రంలో అధికారంలో ఉండడం, రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందన్న ఊపు కనిపించడంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు చెందిన బడా నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, వివేక్, ఈటల రాజేందర్, విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వంటి నాయకులు కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో అధికార పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న ఊపు ప్రజల్లోనూ వచ్చింది.

కార్ణటక ఎన్నికల తర్వాత..
దాదాపు ఆరు నెలలుగా బీజేపీలో పరిస్థితులు మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఈ పరిస్థితి మరీ దారుణంగా మారింది. తెలంగాణ బీజేపీలో దూకుడు తగ్గింది. మరోవైపు అధ్యక్షుడి వైఖరిపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు క్రమశిక్షణకు మారుపేరు అయిన బీజేపీలో చిట్‌చాట్‌లు, బహిరంగ విమర్శలు పెరుగుతున్నాయి. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వంటి నేతలు పార్టీ పైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పార్టీలో చేరికలు కూడా నిలిచిపోయాయి. ఈటల రాజేందర్‌ అయితే పార్టీలో కొత్తగా చేరువారు ఎవరూ లేరని ప్రకటించడం గమనార్హం.

ఎగ్జిట్‌ భయం..
ఇక బీజేపీకి ఇప్పుడు చేరికల మాట అటుంచి ఎగ్జిట్‌ భయం పట్టుకుంది. చాలా మంది నేతలు బీజేపీని వీడేందుకు సిద్ధÐవవుతున్నారని వార ్తలు వస్తున్నాయి. జాతీయ నేత గడ్డం వివేక్‌ మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం జరగుతుంది. మరికొంతమంది కూడా కాంగ్రెస్‌లో చేరతాన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీకి ఇప్పుడు ఎగ్జిట్‌ కమిటీ వేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

అధినేతపైనే అసంతృప్తి..
తెలంగాణలో ఇటీవల చేరిన నేతలు క్రమశిక్షణ తప్పుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. అధ్యక్షుడిని మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే దీని వెనుక ఎవరు ఉన్నదనేది మాత్రం బయటకు రావడం లేదు. కొత్తగా చేరిన నేతలు ఇలా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అసలైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉన్నవారు, బీజేపీ నేతలు ఇలాంటి చర్యలకు పూనుకోరు అనేది వాద. కొత్తగా చేరిన వారికి పదవులపై కాంక్షతో తెరవెనుక రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. మరోవైపు బీజేపీ అధిష్టానం సంజయ్‌ను మార్చేది లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొంత మంది పార్టీని వీడడమే మంచిదనుకుంటున్నారు.

బీఆర్‌ఎస్‌కు సానుకూలతపై అనుమానాలు..
మరోవైపు బీజేపీలో చేరిన నేతలంతా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా చేరిన వారే. బీజేపీపై వారికి ప్రేమ లేదు. బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడి రాలేదు. ఈ తరుణంలో ఇటీవల బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్న వాదనను తెరపైకి తెస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు కేంద్రం అనుకూలంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఇక్కడ పనిచేయలేమని భావిస్తున్నారు. దీంతో పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరితో మంచిదని భావిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular