https://oktelugu.com/

Afghanistan: అప్ఘనిస్తాన్ సరిహద్దు దేశాల మద్దతు ఎవరికి?

అఫ్గానిస్థాన్(Afghanistan) లో పరిణామాలను చుట్టుపక్కల ఉన్న దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. తమ ఉనికికి ప్రమాదమేమి ఉండదని చూసుకుంటున్నాయి. దీంతో ముస్లిం దేశాలపై అఫ్గాన్ ప్రభావం చూపుతోంది. ముస్లిం దేశాలతో పాటు ప్రపంచమే జాగ్రత్తగా పరిశీలిస్తోంది. అన్ని దేశాలు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నాయి. అఫ్గానిస్థాన్ లో పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని ద ఆర్గనైజేషన్ ఆప్ఇస్లామిక్ కో ఆపరేషన్ (ఓఐసీ) పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఓఐసీ పిలుపునిచ్చింది. అఫ్గాన్ లో శాంతి స్థాపనలో తాము క్రియాశీల పాత్ర […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 16, 2021 / 05:37 PM IST
    Follow us on

    అఫ్గానిస్థాన్(Afghanistan) లో పరిణామాలను చుట్టుపక్కల ఉన్న దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. తమ ఉనికికి ప్రమాదమేమి ఉండదని చూసుకుంటున్నాయి. దీంతో ముస్లిం దేశాలపై అఫ్గాన్ ప్రభావం చూపుతోంది. ముస్లిం దేశాలతో పాటు ప్రపంచమే జాగ్రత్తగా పరిశీలిస్తోంది. అన్ని దేశాలు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నాయి. అఫ్గానిస్థాన్ లో పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని ద ఆర్గనైజేషన్ ఆప్ఇస్లామిక్ కో ఆపరేషన్ (ఓఐసీ) పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఓఐసీ పిలుపునిచ్చింది. అఫ్గాన్ లో శాంతి స్థాపనలో తాము క్రియాశీల పాత్ర పోషించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.

    అఫ్గాన్ లో ప్రస్తుత పరిస్థితిపై పొరుగున ఉన్న ఇరాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాబూల్, హెరాత్ లలోని తమ దౌత్యవేత్తలు, సిబ్బందికి ఎలాంటి ప్రమాదం ఉండదని తాలిబన్లను ఇరాన్ శుక్రవారం అభ్యర్థించింది. ప్రస్తుతం హెరాత్ లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. సున్నీల నేతృత్వంలోని తాలిబన్ల విషయంలో షియా ఆధిక్య దేశమైన ఇరాన్ మొదట్నుంచి ఆందోళన వ్యక్తం చేస్తోంది.

    1988లో మజర్-ఏ-షరీఫ్ నగరంలోని ఇరాన్ కు చెందిన ఒక జర్నలిస్టుతో పాటు ఎనిమిది మంది దౌత్యవేత్తలను తాలిబన్లు హతమార్చారు. దీనికి స్పందనగా ఇరాన్ దాడి చేయాలని భావించింది. తర్వాత కాలంలో తాలిబన్లు, ఇరాన్ లమధ్య సంబంధాలు మెరుగయ్యాయి. గత జులైలో బ్రెహాన్ లో ఇరాన్ విదేశాంగ మంత్రితో తాలిబన్ల బృందం చర్చలు కూడా జరిపింది.

    మూడు మధ్య ఆసియా దేశాలు అఫ్గాన్ తో సరిహద్దులు కలిగి ఉన్నాయి. అఫ్గాన్ సంక్షోభం ప్రభావం ఈ దేశాలపై పడుతోంది. గత జులైలో కొందరు అఫ్గాన్ జవాన్లు ఉజ్బెకిస్థాన్ కు పారిపోయారు. ఆ తర్వాత అఫ్గాన్ లోని తమ బలగాలను ఉబ్జెకిస్తాన్ ఉపసంహరించుకుంది. తమ సరిహద్దులను కూడా కట్టుదిట్టం చేసింది. మరోవైపు తజకిస్తాన్ కూడా సరిహద్దుల వెంబడి నిఘా కోసం దాదాపు 20 వేల మంది సైనికుల్ని అదనంగా మోహరించింది.

    కాబూల్ పై తాలిబన్లు పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో నగరంలోని హమిద్ కర్జాయ్ అందర్జాతీయ విమానాశ్రయాన్ని తాము ఆధీనంలోకి తీసుకుంటామని టర్కీ ప్రకటించింది. అఫ్గాన్ నుంచి అమెరికా సేనలు ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో టర్కీ ఈ ప్రకటన చేసింది. విమానాశ్రయ భద్రతను తాము చూసుకుంటామని ప్రకటించింది. అయితే టర్కీ నిర్ణయంపై తాలిబన్లు సంతోషంగా లేరు.

    తాలిబన్ల ధోరణి సరిగా లేదు. ఒక ముస్లిం మరో ముస్లింతో ఇలా ప్రవర్తించకూడదు అని టర్కీ అధ్యక్షుడు ెర్డోగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అఫ్టాన్ లో శాంతిని స్థాపించగలమని ప్రపంచ దేశాలకు రుజులు చేయాలని తాలిబన్లకు ఆయన అభ్యర్థించారు. పాకిస్తాన్ కు టర్కీకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ కు తాలిబన్లకు మధ్య కూడా ఇలాంటి సంబంధాలే ఉన్నాయి. దీంతో అఫ్గాన్ లో భవిష్యత్ లో టర్కీ క్రియాశీల పాత్ర పోషించే అవకాశముంది.

    పాకిస్తాన్ లో దాదాపు 30 లక్షల మంది అఫ్గాన్ శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. రెండు దేశాల మధ్య 2500 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. దీంతో తాలిబన్లకు పాక్ అత్యంత కీలకమైన పొరుగు దేశం. అఫ్గాన్ సంక్షోభంలో మొదటి నుంచి పాక్ క్రియాశీల పాత్ర పోషిస్తోంది. ఆదివారం ఇస్లామాబాద్ లోని పాక్ ప్రభుత్వ ప్రతినిధులతో అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరిపారు. అయితే తాలిబన్లకు పాక్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తోంది.

    ప్రపంచంలో అతిపెద్ద సున్నీ ముస్లిం దేశం సౌదీ అరేబియా. అఫ్గానిస్తాన్ విషయంలో మాత్రం సౌదీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. పాకిస్తాన్ సాయంతో అఫ్గాన్ లో ఆధిపత్యం చెలాయించాలని సౌదీ అరేబియా భావిస్తోంది. అయితే అఫ్గాన్ సంక్షోభం విసయంలో సౌదీ బహిరంగంగా స్పందించడం లేదు. మరో వైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఈ సంక్షోభం నుంచి వ్యూహాత్మకంగా దూరం పాటిస్తోంది.