Adobe CEO Hyderabad: అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఐటీ కి ఎంత ప్రసిద్దమో.. ఇప్పుడు హైదరాబాద్ కూడా అంతే ప్రసిద్ధమైపోయింది. ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్… ప్రఖ్యాత సంస్థల చూపు మొత్తం హైదరాబాద్ లోనే ఏర్పాటయ్యాయి.. ప్రపంచం మొత్తం తిరోగమనం లో ఉంటే భారత్ మాత్రమే ఐటీ ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి సాధిస్తున్నది. వీటిలో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. ఈ క్రమంలో హైదరాబాదులో మూడు రోజులపాటు జరిగే దీ ఇండస్ అంత్రో ప్రెన్యూర్స్ కార్యక్రమానికి అడోబ్ సీఈవో శంతను నారాయణ్ హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన తన మదిలో ఉన్న మాటలను పంచుకున్నారు.

హైదరాబాదులోనే ఇంక్యుబేట్ చేసేవాళ్లేమో
భవిష్యత్తులో కృత్రిమ మేధకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతర రంగాల్లోనూ ఇది విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే దీనిని ఉపయోగించుకొని చాలా సంస్థలు విభిన్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. ఇక హైదరాబాద్ నానాటికి అవకాశాల సౌధంగా మారిపోతుంది.. దీనివల్ల లక్షలాదిమందికి ఉపాధి లభిస్తున్నది. ప్రపంచం మొత్తం తిరోగమనంలో ఉంటే.. ఒక్క హైదరాబాద్ మాత్రమే పురో గమనంలో ఉంది. ఇప్పటికిప్పుడు ఆడోబ్ కంపెనీని గనుక ప్రారంభిస్తే హైదరాబాదులోనే ఇంక్యూ బేట్ చేసేవాళ్లేమో అని శంతను నారాయణ్ అన్నారంటే హైదరాబాద్ కు ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఈ తరంలో పుట్టి గనుక ఉంటే అమెరికా వెళ్లేవాడిని కాదని ఆయన వ్యాఖ్యానించారు.. హైదరాబాద్ నగరం తన ఎదుగుదలకు తోడ్పడిందని ఆయన పేర్కొన్నారు. విద్యారణ్య, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన తాను… ఈ స్థాయికి వస్తానని ఎప్పుడు అనుకోలేదని ఆయన వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ డిగ్రీ చేస్తుండగా, మైక్రో ప్రాసెసర్స్ పై ఆసక్తి పెరిగి, అందరిలాగానే ఆయన అమెరికా వెళ్లారు. ఆ తర్వాత ఆరు బిలియన్ డాలర్ల కంపెనీకి సీఈవో అయ్యారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.. అయితే అమెరికా కంపెనీకి సీఈఓ గా నియమితుడైన తర్వాత వచ్చిన ఆనందం కంటే… పద్మశ్రీ పురస్కారం తీసుకున్నప్పుడు కలిగిన ఆనందమే తనకు ఎక్కువ అని శంతను వ్యాఖ్యానించారు.

కేటీఆర్ పనికిమాలిన వ్యాఖ్యలు
ఇదే సమావేశానికి హాజరైన మంత్రి కేటీఆర్ ఆడోబ్ కార్యకలాపాలను హైదరాబాదులో విస్తరించాలని కోరారు.. టీ హబ్ ద్వారా ఎన్నో విప్లవత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని కేటీఆర్ పేర్కొన్నారు.. ఇటీవల అంతరిక్షంలోకి ప్రైవేటు ఉపగ్రహాన్ని కూడా పంపామని ఆయన వివరించారు.. కానీ ఇదే దశలో ఎల్లుండి శంతను బెంగళూరు వెళ్లాల్సిన నేపథ్యంలో… కేటీఆర్ ఆయనను ఉటంకిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ” మీరు బెంగళూరు వెళ్తున్నారు. కానీ అక్కడ ఇక్కడి మాదిరి స్వేచ్ఛగా తిరగలేరు. మీకోసం నేను హెలికాప్టర్ పంపిస్తాను” అని పనికిమాలిన వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల భారత ఐటీ రాజధాని బెంగళూరు ప్రతిష్టను కేటీఆర్ మంట కలిపారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇదే దశలో కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు శంతను మౌనంగా ఉండడం విశేషం. అయితే భారత రాష్ట్ర సమితి పేరుతో దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న కెసిఆర్.. ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారో, వచ్చే ఎన్నికల్లో కర్ణాటక నుంచి ఏ విధంగా పోటీ చేస్తారో తెలియాల్సి ఉంది.