https://oktelugu.com/

Adani Singareni: సింగరేణిలోకి అదానీ ఎంట్రీ.. కేసీఆర్ కు ముందే తెలుసా..?

Adani Singareni: భారతదేశ కుబేరుడు గౌతమ్ అదానీ ప్రముఖ కంపెనీలను చేజిక్కించుకుంటున్నాడు. తాజాగా సింగరేణిలోనూ అడుగుపెట్టారు. ఈరోజు నిర్వహించిన టెండర్లలో అతి తక్కువ ధరకు అదానీ కోట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒడిశా సంస్థకు చెందిన నైనికోల్ బ్లాక్ లో మైనింగ్, ఆపరేషన్ల కోసం నిర్వహించిన టెండర్లలో రూ.1.090 కోట్ల కు కోట్ చేసి ఎల్ -1 గా నిలిచారు. దీంతో నిబంధనల ప్రకారం టెండర్లను ఆ సంస్థకే అప్పగించాల్సి ఉంటుంది. సింగరేణిలో ఎక్కువభాగం తెలంగాణలో విస్తరించి […]

Written By:
  • NARESH
  • , Updated On : July 21, 2022 / 04:10 PM IST
    Follow us on

    Adani Singareni: భారతదేశ కుబేరుడు గౌతమ్ అదానీ ప్రముఖ కంపెనీలను చేజిక్కించుకుంటున్నాడు. తాజాగా సింగరేణిలోనూ అడుగుపెట్టారు. ఈరోజు నిర్వహించిన టెండర్లలో అతి తక్కువ ధరకు అదానీ కోట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒడిశా సంస్థకు చెందిన నైనికోల్ బ్లాక్ లో మైనింగ్, ఆపరేషన్ల కోసం నిర్వహించిన టెండర్లలో రూ.1.090 కోట్ల కు కోట్ చేసి ఎల్ -1 గా నిలిచారు. దీంతో నిబంధనల ప్రకారం టెండర్లను ఆ సంస్థకే అప్పగించాల్సి ఉంటుంది. సింగరేణిలో ఎక్కువభాగం తెలంగాణలో విస్తరించి ఉంది. ఇటీవల సింగరేణి ప్రైవేటీకరణ అవుతోందని కేసీఆర్ ఆరోపించారు. ఈ తరుణంలో అదానీ ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

    ఒడిశాలోని నైనికోల్ బ్లాక్ 2015 ఆగస్టు 13న సింగరేణి సంస్థకు కేటాయించబడింది. మరే సంస్థతో భాగస్వామ్యం లేకుండా పూర్తి షేర్లు సింగరేణికే ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే మైనింగ్ కోసం అనుమతి ఇవ్వలేదు. దీంతో తవ్వకాలు ప్రారంభం కాలేదు. ఈ బ్లాక్ దక్కించుకున్న సింగరేణి 2015 ఏప్రిల్ 13న రూ.25 కోట్లు, గతేడాది జూలై 7న మరో రూ.1.25 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. బొగ్గు తవ్వకాల కోసం సింగరేణి సంస్థ దాఖలు చేసిన దరఖాస్తులకు అనుగుణంగా 2019 ఏప్రిల్ 18న మైనింగ్ ప్లాన్ కు అనుమతి లభించగా ఫారెస్టు క్లియరెన్స్ కూడా లభించింది.

    నైనికోల్ లో ఏటా 10 మిలియన్ టన్నుల మేర బొగ్గు తవ్వకాలు, ఆపరేషన్ కోసం సింగరేణి సంస్థ ఐదు కంపెనీలను ఆహ్వానించింది. ఎల్ -1గా అదానీ సంస్థ తరుపున జిందాల్, కోల్ కతాకు చెందిన ఆంబే మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈ- రివర్స్ ఆక్షన్ ద్వారా టెండర్ల ప్రక్రియలో పాల్గొంది. మొంత్తం మూడు సంస్థల నుంచి క్వాలిఫైడ్ బిడ్ లు దాఖలైనట్లు సింగరేణి సంస్థ ధ్రువీకరించింది. కంపెనీ మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వ ఈ -పోర్టల్ ద్వారా ఎల్-1 సంస్థను ఎంపిక చేయడానికి ఓపెన్ ఎంక్వయిరీ కరూడా నిర్వహిస్తున్నట్లు సింగరేణి స్పష్టం చేసింది.

    ఒడిశాకు చెందిన నైనికోల్ బ్లాక్ లో భారీగా అవకతవకలు జరిగినట్లు పీసీసీ మాజీ చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. అటు విదేశాలకు బొగ్గును సరఫరా చేసేందుకు మనదేశంలో ఏకైక ఇంపోర్ట్ ఉందని, అది అదానీకి చెందినదేనని కేసీఆర్ కూడా ఆరోపించారు. ఆ సంస్థకు లాభాలు చేకూర్చేలా విదేశీ బొగ్గును బ్లైండింగ్ చేసేలా దిగుమతి చేసుకోవాలన్న నిబంధనను తీసుకొచ్చారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అదానీ తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తారా..? అనే చర్చ జరుగుతుతోంది.

    గుజరాత్ కు చెందిన అదానీకి ప్రధానమంత్రి మోదీ సేల్స్ మెన్ పాత్ర పోషిస్తున్నారని కేసీఆర్ ఈనెల 2న ఆరోపించారు. విదేశీ బొగ్గుకు అదాని సంస్థ మన దేశంలో ఏకైక ఇంపోర్టర్ ఉందని అన్నారు. ఆ సంస్థకు లాభాలు చేకూర్చేందుకే విదేశీ బొగ్గును బ్లెండింగ్ చేసేలా దిగుమతి చేసుకోవాలన్న నిబంధననుతీసుకొచ్చారని అన్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సింగరేణి రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు నిబంధనల ప్రకారం టెండర్లను ఖాయం చేయడమా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.