Adani Group: అదానీకి దోచిపెడుతున్నారా?

Adani Group: జాతీయ స్థాయిలో అదానీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సంస్థ వాణిజ్య, వర్తక వ్యాపారాలపై ప్రతికూలాంశాలు బయటపడుతున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. అదానీ కి కొమ్ముకాయడంపై ప్రధాని మోదీ చుట్టూ అనుమానపు చూపులు పెరుగుతున్నాయి. కానీ అటువంటి అదానీ విషయంలో ఏపీ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. అదానీకి అండగా నిలిచేందుకు జగన్ సర్కారు అన్నవిధాలా ప్రయత్నిస్తోంది. ఏపీ సంపదను కట్టబెట్టేందుకు చకచకా నిర్ణయాలు […]

Written By: Dharma, Updated On : March 9, 2023 12:41 pm
Follow us on

Adani Group

Adani Group: జాతీయ స్థాయిలో అదానీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సంస్థ వాణిజ్య, వర్తక వ్యాపారాలపై ప్రతికూలాంశాలు బయటపడుతున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. అదానీ కి కొమ్ముకాయడంపై ప్రధాని మోదీ చుట్టూ అనుమానపు చూపులు పెరుగుతున్నాయి. కానీ అటువంటి అదానీ విషయంలో ఏపీ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. అదానీకి అండగా నిలిచేందుకు జగన్ సర్కారు అన్నవిధాలా ప్రయత్నిస్తోంది. ఏపీ సంపదను కట్టబెట్టేందుకు చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఏపీలో ఎన్ని ప్రభుత్వ స్థలాలు, పోర్టులు అదానీ పేరు మీద మారిపోయాయో స్పష్టత లేదు కానీ ఇంకా ఇంకా ఇచ్చి వారి కష్టాలను తీర్చేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అదానీ కంపెనీలు జగన్ సర్కారుకు ముద్దుగా మారాయి. విపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి.. పవర్ లోకి వచ్చిన తరువాత అక్కున చేర్చుకున్నాయి. నాడు చంద్రబాబు సర్కారు అదానీ కంపెనీకి ఏ పనులు అప్పజెప్పినా అభ్యంతరాలు వ్యక్తం చేసే వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చింది. వందల ఎకరాలను సంతర్పణ చేస్తోంది. మొన్నటికి మొన్న కేబినెట్ భేటీలో విశాఖలో గతంలో ఇచ్చిన 130 ఎకరాలకు అదనంగా మరో అరవై ఎకరాలు ఇచ్చేశారు. ముందుగా ఇచ్చిన భూముల్ని సేల్ డీడ్ చేయడంతో ఆ 130 ఎకరాలు తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చుకున్నారు. ఇప్పుడు అరవై ఎకరాలను ఏం చేస్తున్నారో గుట్టుగా ఉంది. దాని వెనుక కథ మాత్రం బయటపడడం లేదు.

Adani Group

తాజాగా బొగ్గు కొనుగోలులో జగన్ సర్కారు అదానీ కంపెనీకి అగ్రతాంబూలం ఇచ్చింది. ఆ కంపెనీ నుంచి అత్యధిక ధర చెల్లించి బొగ్గు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దాదాపు రెండున్నర రెట్లకు మించి చెల్లించేందుకు డిసైడ్ అయ్యింది. అయితే ఇదంతా అదానీని కష్టాల నుంచి గట్టెక్కించేందుకేనన్న టాక్ వినిపిస్తోంది. టన్నుకు రూ. పదమూడు వేలు మాత్రమే విద్యుత్ సంస్థలు చెల్లించాలి. అదే భారత్ లో ఆ బొగ్గు కొనుగోలు చేయాలంటే రూ. ఐదు వేలు పడుతుంది. అందుకే విదేశాల నుంచి ముఖ్యంగా అదానీ బొగ్గును దిగుమతి చేసుకుంటోంది. దీని వల్ల రెండున్నర వేల కోట్ల వరకూ అదనపు భారం విద్యుత్ సంస్థలపై పడుతుంది. అయితే ఇది వేసవి ప్రారంభమే ముందుఈ లెక్క.. ఇంకా విద్యుత్ వినియోగం పెరిగే కొద్ది ఎంత పెరుగుతుందో చెప్పడం కష్టం.

తనకు ఎంతో సన్నిహితుడైన అదానీ కష్టాల్లో ఉండడాన్ని జగన్ తట్టుకోలేకపోతున్నారు. ఆ కష్టాల నుంచి గట్టెక్కించాలని భావిస్తున్నారు. ఇప్పటికే అదానీ కి కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ ను అప్పగించాలని అనుకున్నారు. కానీ ఆ సంస్థ కు హిండెన్ బర్గ్ దెబ్బ తగలడంతో ప్రస్తుతానికి నిలిపివేశారు. విశాఖలో తీసుకున్న భూముల్లో పెడతామన్న డేటా సెంటర్ కు కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు. ఇవన్నీ బయటకు తెలిసినవే. తెలియకుండా అదానీ కోసం సీఎం జగన్ ఎన్నెన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారో చూడాలి. అదానీని సంక్షోభం నుంచి బయటపడేయడానికి తన వంతుగా … ఏపీ సంపదను కట్టబెడుతున్నారన్న టాక్ మాత్రం విస్తరిస్తోంది.

 

Tags