తెలుగుదేశం పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలు అధికార వైసీపీ బాట పడుతున్నారు. దీనికితోడు ఈ మధ్య జగన్ కూడా చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈఎస్‌ఐ మందుల కుంభకోణంలో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని కటకటాల్లోకి పంపారు.
Also Read: వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?
జైలు జీవితం గడిపిన అచ్చెన్నాయుడు బెయిల్ మీద బయటకొచ్చారు. వచ్చీ రాగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఎక్కడా కనిపించడం లేదు. ప్రజలకూ అందుబాటులోకి రావడం లేదు. అసలే.. ఏపీ టీడీపీ అధ్యక్ష పదవీ బాధ్యతలు అచ్చెన్నాయుడికి ఇస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయన అజ్ఞాతవాసి కావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికితోడు ఇప్పటికే ఎన్నో బాధలు మోసిన తనకు అధికారంలేని పదవి కట్టబెడుతానంటే వాటిని స్వీకరించే పరిస్థితిలో లేనట్లు అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారట.
అయితే.. చంద్రబాబుని నమ్మే తాను ఇలా మోసపోయాననే ఫీలింగ్ అచ్చెన్నాయుడిలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. చిన బాబుని రక్షించుకునేందుకే తనను కేసుల్లో ఇరికించారని, పరోక్షంగా చంద్రబాబు, చినబాబు చేసిన స్కామ్‌లో తాను బలి పశువును అయ్యానని అచ్చెన్నాయుడు బాధపడుతున్నరట. ఈ విషయాన్ని గతంలోనూ తన సన్నిహితుల దగ్గర చెప్పి బాధపడ్డారు కూడా. స్కామ్ మొత్తాన్ని భుజాన వేసుకోవాల్సి రావడం.. జైలుకెళ్లి పరువు పోగొట్టుకోవాల్సి రావడంతో అచ్చెన్నాయుడు ఫీలై బయటకు రావడం లేదనేది తెలుస్తోంది.
Also Read: జగన్ ను వాడుకుంటున్న కేంద్రం
అంతేకాదు.. గతంలో జగన్ పేరు చెబితేనే ఒంటి కాలిమీద లేచే అచ్చెన్నాయుడు.. ఇకనుంచి జగన్‌ను టార్గెట్ చేయడం మానుకోవాలని డిసైడ్ అయ్యారని తెలిసింది. జగన్ మీద విమర్శలు చేయాలంటే టీడీపీ ఎప్పుడూ అచ్చెన్నాయుడినే ముందుకు వదులుతుంటుంది. నిండు సభలోనే ఆయన జగన్‌ను ఎన్నోసార్లు నిలదీశారు. ఎన్నో విధాలా విమర్శలు చేశారు. ప్రజావేదిక కూల్చివేత దగ్గర్నుంచి.. అమరావతి ఆందోళనల వరకు తనకు సంబంధం లేని ప్రతి విషయాల్లో చంద్రబాబు అచ్చెన్నాయుడిని రంగంలోకి దింపారు. తీరా ఇప్పుడు కేసులు నెత్తిమీద పడ్డాక పూర్తిగా సైలెంట్ అయ్యారు. అందుకే అంతర్వేది ఘటన నుంచీ.. టీడీపీని కుదిపేస్తున్న అమరావతి భూముల కుంభకోణం, ఫైబర్ నెట్ నిధుల దుర్వినియోగంపై ఒక్కసారి కూడా కామెంట్ చేయడం లేదు. ఒక రకంగా ఆయన పార్టీకి, చంద్రబాబుకి కూడా దూరంగా ఉంటున్నట్లే ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడంతో బాబు వైఖరి మొత్తం ఆయనకు అర్థమైనట్లుగా తెలుస్తోంది. ఇతరుల కోసం తాము బలికావడం ఎందుకని ఈ డిస్టెన్స్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.