https://oktelugu.com/

ABN RK Analysis : ప్రకృతికి నచ్చడం లేదు కాబట్టి పీఎం, కేసీఆర్, జగన్ గద్దె దిగిపోవాలి

ABN RK Analysis : పిచ్చి తలకెక్కింది. రోకలి నెత్తికి చుట్టండి అన్నాడట వెనుకటికి ఒకడు.. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పరిస్థితి కూడా అలానే ఉంది.. ఇతగాడి పచ్చ పైత్యం ఎంతకు దిగజారింది అంటే… ప్రధానమంత్రి మోడీకి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖర రావు, జగన్మోహన్ రెడ్డి లను చూస్తే ప్రకృతి ఈసడించుకుంటుందని, వారికి ఏమాత్రం అధికారంలో ఉండే నైతికత లేదని తేల్చి చెబుతున్నాడు. ఇది ఎంత మాత్రం క్షంతవ్యం కాదని స్పష్టం చేస్తున్నాడు.. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 12, 2023 / 09:24 AM IST
    Follow us on

    ABN RK Analysis : పిచ్చి తలకెక్కింది. రోకలి నెత్తికి చుట్టండి అన్నాడట వెనుకటికి ఒకడు.. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పరిస్థితి కూడా అలానే ఉంది.. ఇతగాడి పచ్చ పైత్యం ఎంతకు దిగజారింది అంటే… ప్రధానమంత్రి మోడీకి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖర రావు, జగన్మోహన్ రెడ్డి లను చూస్తే ప్రకృతి ఈసడించుకుంటుందని, వారికి ఏమాత్రం అధికారంలో ఉండే నైతికత లేదని తేల్చి చెబుతున్నాడు. ఇది ఎంత మాత్రం క్షంతవ్యం కాదని స్పష్టం చేస్తున్నాడు.. అంటే అధికారంలో ఉండాలంటే ప్రకృతి అనుమతి తీసుకోవాలా, ప్రజలు వేసిన ఓట్లకు చెల్లుబాటు లేదా? గాలి దేవుడిని, వాన దేవుడిని, అగ్ని దేవుడిని పర్మిషన్ అడగాలా? ఒకవేళ వారు వద్దు అంటే ఎన్నికల పోటీ చేయకూడదా? ఇదెక్కడి వితండవాదం ఆర్కే? చంద్రబాబు 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఇలాగే ప్రకృతి పర్మిషన్ అడిగాడా? పోనీ పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచేటప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నాడు? ఎవరు సరే అంటే అన్ని ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు? అంటే ఆ బ్లడ్ బ్రీడ్ జాతి మాత్రమే ముఖ్యమంత్రులుగా పనికొస్తారా? మిగతా వారికి ఆ సత్తా లేదా?

    హెలికాప్టర్ కూలి రాజశేఖర్ రెడ్డి కన్నుమూసినప్పుడు పచ్చ మంద అలాగే వ్యాఖ్యలు చేసింది.. కమ్యూనిస్టు ముసుగులో ఉండే ఓ పచ్చ నాయకుడు ఏకంగా పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయాడంట ఒక మనిషి చావు గురించి అత్యంత హీనంగా మాట్లాడాడు.. కానీ అదే నాయకుడు తన రాజకీయ ప్రాపకం కోసం సొంత బాబాయ్ కొడుకుని ఆగస్టు 15న అతి కిరాతంగా గొడ్డళ్ళతో నరికి నరికి చంపించాడు. మళ్ళీ ఉదయం లేస్తే సమ సమాజం అంటూ నీతులు చెబుతాడు. జగన్ వెళ్తున్న హెలీ కాప్టర్ ప్రతికూల పరిస్థితుల కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయింది.. అంటే దానిని కూడా ప్రకృతి పగబట్టింది అని రాసుకోవాలా? వాతావరణం అన్నాక మార్పులు జరగవా? అంటే దానిని కూడా ప్రకృతి ప్రకోపం అనే యాంగిల్ లో చూడాలా? ఆ లెక్కన 2016లో ఆంధ్రజ్యోతి మెయిన్ ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగింది.. అంటే ఆంధ్రజ్యోతి పత్రిక నడవడం అగ్ని దేవుడికి ఇష్టం లేదు. మరి ఆ లెక్కన పత్రికను ఎందుకు మూసి వేయలేదు? ఇంకా ఎందుకు నడిపిస్తున్నారు. గురువింద గింజ తన నలుపు ఎరగదన్నట్టు.. పాపం ఆర్కే తనకింద ఉన్న నలుపుల్ని మర్చిపోయినట్టున్నాడు.

    ఇదే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాలుగేళ్లు కరువు విలయతాండవం చేసింది.. ప్రాజెక్టులన్నీ ఎండిపోయాయి? అంటే ఇది కూడా ప్రకృతి విపత్తు కిందే కదా… మరి అప్పుడు చంద్రబాబుకు అధికారంలో ఉండే నైతికత ఎక్కడిది? విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో హుద్ హుద్ తుఫాన్ చెలరేగింది.. అపారమైన నష్టం వాటిల్లింది.. గోదావరి పుష్కరాలప్పుడు చాలామంది భక్తులు తొక్కిసలాటలో చనిపోయారు. మరి అప్పుడు ప్రకృతి విపత్తులు అని రాయలేదేం? ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఎమ్మెల్యేలు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధాన మంత్రులవుతారు.. ప్రకృతికి కోపం జగన్, కేసీఆర్,మోడీ మాత్రమే కాదు ఆర్కే ఆరాధించే చంద్రబాబు కూడా పోతాడు. అంతేగాని బొడ్రాయి లాగా అలాగే బతికి బట్ట కట్టడు. ప్రకృతి అంటూ పచ్చ పైత్యం ప్రదర్శించేకంటే… ఒక మంచి డాక్టర్ కు చూపించుకోవచ్చు కదా ఆర్కే!