https://oktelugu.com/

CM Jagan vs ABN RK : ఓహో… జగన్ పై ఇలా కూడా వార్తలు రాయొచ్చా మై డియర్ ఆర్కే

ABN Radhakrishna – Jagan : “ఎందుకు,ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎవరు”ఈ ఐదు ప్రాథమిక ప్రశ్నలు లేకుంటే అది వార్త అనిపించుకోదు. అది వార్త కాదు. ఇప్పటి వర్తమానంలో అవేవీ అవసరం లేదు. ఏది అనిపిస్తే అదే వార్త, జనంతో పని లేదు, జనం సమస్యలతో అవసరం లేదు. గిట్టని వాన్ని కొట్టడమే ఇప్పుడు వార్త ప్రాథమిక లక్షణం. ఇందులో ఆ మీడియా ఈ మీడియా అని లేదు.. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం, బొంబాట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 23, 2023 / 01:17 PM IST
    Follow us on

    ABN Radhakrishna – Jagan : “ఎందుకు,ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎవరు”ఈ ఐదు ప్రాథమిక ప్రశ్నలు లేకుంటే అది వార్త అనిపించుకోదు. అది వార్త కాదు. ఇప్పటి వర్తమానంలో అవేవీ అవసరం లేదు. ఏది అనిపిస్తే అదే వార్త, జనంతో పని లేదు, జనం సమస్యలతో అవసరం లేదు. గిట్టని వాన్ని కొట్టడమే ఇప్పుడు వార్త ప్రాథమిక లక్షణం. ఇందులో ఆ మీడియా ఈ మీడియా అని లేదు.. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం, బొంబాట్ చేయడం పరిపాటయింది.. కానీ వీటిల్లో కొన్ని మీడియా సంస్థలు ఉంటాయి..అవి రాజకీయ పార్టీల రంగులు పూసుకుని పోతురాజు మాదిరి చర్నా కోల్ తో కొట్టుకుంటూ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రికకు అగ్రతాంబూలం ఇవ్వచ్చు. అంటే ఈనాడు కూడా ఇప్పుడు అలానే మారిపోయింది.. జగన్ మార్గదర్శి మీద గుడ్లు ఉరుముతున్న వేళ..ఏపీ లో పాలన మీద, ప్రభుత్వ పథకాల మీద అడ్డగోలుగా రాస్తోంది.

    మొన్నామధ్య దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైయస్ విజయలక్ష్మి జన్మదినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన తల్లికి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.. ఆ తర్వాత సాయంత్రానికి ఎప్పుడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా “హ్యాపీ బర్త్ డే టూ యూ అమ్మా” ఒక అంటూ ఒక ట్వీట్ చేశారు..ఇది రాధాకృష్ణకు దారుణంగా కనిపించింది. వైయస్ విజయలక్ష్మికి ఘోరమైన అవమానం లాగా అతడికి ఘోచరించింది..ఇంకేముంది తన పేపర్ లో తాటి కాయంత అక్షరాలతో ఏపీ ఎడిషన్ లో బ్యానర్ వార్త ప్రచురించింది. ట్విట్టర్ ద్వారా జగన్ ఆలస్యంగా శుభాకాంక్షలు చెప్పడమే అతని పాపమైపోయింది.. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి ట్విట్టర్ అకౌంట్ ముఖ్య మంత్రి కార్యాలయ ఉద్యోగులు చూసుకుంటారు.. పొద్దస్తమానం జగన్ ఫోన్ పట్టుకుని కూర్చోడు. ఈ మాత్రం ఇంగితం రాధాకృష్ణకు లేదా? తన తల్లికి ఫోన్ ద్వారా జగన్ శుభాకాంక్షలు చెప్పి ఉంటాడు..దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? ఇవ్వాళ షర్మిలకు ఒక రేంజ్ లో కవరేజిస్తున్న రాధాకృష్ణ.. అప్పుడు వైఎస్ విజయలక్ష్మి విశాఖపట్నంలో పోటీ చేస్తున్నప్పుడు బైబిల్ చేత పట్టుకుని ప్రచారం చేస్తే ఏ విధమైన వార్తలు రాశారో అందరికీ తెలుసు.. వైయస్ షర్మిల పాదయాత్ర చేస్తే ఏ విధంగా ఇచ్చారో తెలుసు. వైయస్ షర్మిల వ్యక్తిగత జీవితం పై ఎలాంటి వార్తలు రాశారో కూడా తెలుసు.

    ప్రస్తుతం షర్మిలకు, జగన్ కు గ్యాప్ ఏర్పడింది కాబట్టి రాధాకృష్ణ అందులో చొరబడ్డాడు.. ఆమెను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో ఇంటర్వ్యూ చేశాడు. ఆమె పాదయాత్రకు విశేషమైన కవరేజ్ ఇచ్చాడు. ఆమె కూడా ఇందుకు ప్రతిగా జాకెట్ యాడ్స్ ఇచ్చింది.. జగన్ యాడ్స్ ఇవ్వడం లేదు కాబట్టి పసుపు పచ్చ విషం చిమ్ముతున్నాడు. జగన్ వ్యక్తిగత జీవితాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. సరే రాధాకృష్ణ లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు మొన్న పుట్టినరోజు జరుపుకున్నాడు. నందమూరి కుటుంబాన్ని చెందిన అందరూ శుభాకాంక్షలు తెలియజేశారా? జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు? మరి దాన్ని ఏమనుకోవాలి?

    గత ఏడాదిగా చంద్రబాబు నాయుడు సోదరుడు రాంమ్మూర్తి నాయుడు మంచానికే పరిమితమయ్యాడు. అతడిని ఒక్కసారైనా పరామర్శించాడా? అక్కడిదాకా ఎందుకు సొంత తల్లి అమ్మణమ్మ మృతిచెందితే చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు కుప్పంలో ఉన్నాడు? తన తండ్రి ఖర్జూరం నాయుడు, అమ్మణమ్మ జయంతులు, వర్దంతులు నిర్వహిస్తున్నాడా? ప్రతి ఏటా సంక్రాంతికి కుప్పం వెళ్లే చంద్రబాబు.. మిగతా రోజులు ఎందుకు వెళ్లడం లేదు? ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు కనిపిస్తాయి.. మరి వీటి మీద ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ రాస్తున్నాడా? ఓహో జగన్ ముఖ్య మంత్రి కాబట్టి, అతడికి చంద్ర బాబుకు పడటం లేదు కాబట్టి, ఇలా వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ” పెన్ను” బిగించాడా? ఇలా అడ్డగోలు వార్తలు రాస్తే బొక్క పడేది చంద్రబాబుకే. 2019 లో ఇలా రాసి రాసి బాబును “23” దగ్గర కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా అదే ఒరవడి కొనసాగించాలి అనుకుంటున్నట్టున్నాడు.. అందుకే ఇలా రాస్తున్నాడు.. ఫాఫామ్ చంద్రబాబు!