Netaji: నేతాజీ పోరాటానికి యావదాస్తిని త్యాగం చేసిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడి కథ ఇదీ

Netaji: ‘అజాద్ హింద్ ఫౌజ్’ అనే పోరాట సంస్థను స్థాపించి భారత దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారిపై యుద్ధం ప్రకటించిన మన సమరయోధుడు ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్’. బ్రిటీష్ ఉక్కు పిడికిలి నుంచి భారత్ ను విముక్తి చేసేందుకు దేశంలోని అతివాద యువకులతో కలిసి సైన్యాన్ని ఏర్పాటు చేసి మరీ బ్రిటన్ పై యుద్ధానికి దిగాడు. ఆ సమయంలో ఈ పోరాటానికి మద్దతుగా నేతాజీ విరాళాల ఇవ్వాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. దానికి భారీ స్పందన […]

Written By: NARESH, Updated On : January 25, 2022 12:53 pm
Follow us on

Netaji: ‘అజాద్ హింద్ ఫౌజ్’ అనే పోరాట సంస్థను స్థాపించి భారత దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారిపై యుద్ధం ప్రకటించిన మన సమరయోధుడు ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్’. బ్రిటీష్ ఉక్కు పిడికిలి నుంచి భారత్ ను విముక్తి చేసేందుకు దేశంలోని అతివాద యువకులతో కలిసి సైన్యాన్ని ఏర్పాటు చేసి మరీ బ్రిటన్ పై యుద్ధానికి దిగాడు. ఆ సమయంలో ఈ పోరాటానికి మద్దతుగా నేతాజీ విరాళాల ఇవ్వాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. దానికి భారీ స్పందన వచ్చింది. భారతీయ ప్రజలు, వ్యాపారాలు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను నడిపించారు.

అబ్దుల్ హబీబ్ యూసుఫ్ మర్ఫానీ అనే సంపన్న గుజరాతీ వ్యాపారవేత్త రంగూన్ లో స్థిరపడ్డారు. నేతాజీ ప్రసంగాలు అప్పట్లో ఆయనలోని జాతీయవాదిని మేల్కొలిపాయి. నేతాజీ నిధుల కోసం ఇచ్చిన పిలుపునకు ఈ వ్యాపారి స్పందించాడు.

Also Read: ఏపీలోని స్కూళ్లలో కొత్త రూల్స్.. ఇక వాటిని పాటించడం కంపల్సరీ..

1944 జూలై 9 వరకూ వ్యాపారి అబ్దుల్ హబీబ్ క్రమం తప్పకుండా రెండు నుంచి మూడు లక్షల రూపాయాలను ఒకేసారి విరాళంగా ఇవ్వడం ప్రారంభించాడు. అబ్దుల్ హబీబ్ అప్పట్లో ఒక వెండి సూట్ కేసులో నగలు, మొత్తం ఆస్తి కాగితాలు, నగదుతో కలిపి దాదాపు అప్పట్లోనే వాటి విలువ కోటి రూపాయలతో నేతాజీ పోరాటానికి మొత్తం యావదాస్తిని విరాళంగా అందించాడు. దీనికి ప్రతిగా అబ్దుల్ కేవలం తనకు ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క ఖాకీ యూనిఫాం ను ఇవ్వాలని నేతాజీని అడిగాడు.

నేతాజీ అతడికి ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన ‘తమ్ ఘా-ఏ-సేవక్-ఏ-హింద్’తో సత్కరించి గౌరవించాడు.

ఆజాద్ హింద్ ఫౌజ్ పోరాటం కోసం.. భారత స్వాతంత్ర్య కాంక్ష కోసం యావదాస్తిని నేతాజీ పోరాటానికి అర్పించిన వ్యాపారి అబ్దుల్ హబీబ్ దేశభక్తిని చూసి కొందరు ‘హబీబ్ కు పిచ్చిపట్టింది’ అని విమర్శించారు. దీనికి అబ్దుల్ హబీబ్ ఏమన్నాడో తెలుసా? ‘నేను పిచ్చివాణ్నే. నేను అంగీకరిస్తాను. మీలో ప్రతి ఒక్క భారతీయులు పిచ్చివాళ్లు కావాలని నేను కోరుకుంటున్నాను. మన దేశానికి, మన మాతృభూమికి విజయం, స్వేచ్ఛను సాధించడానికి.. మనకు అలాంటి పురుషులు, మహిళలు అవసరం’ అని అబ్దుల్ తనలో ఉప్పొంగుతున్న ‘దేశభక్తి’ని పిచ్చితో పోల్చారు. అలా స్వాతంత్ర్య పోరాటంలో మొత్తం ఆస్తిని త్యాగం చేసి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడిగా నిలిచాడు.

అలాంటి ఎందరో వీరుల త్యాగాలతోనే నేడు భారతావణి ఈ స్వేచ్ఛావాయువలను పీలుస్తోంది. ప్రాణాలు, ఆస్తులు త్యాగం చేసి పోరాడిన వారి త్యాగనిరతికి మనమూ సెల్యూట్ చేద్దాం.