Chandrababu Case: 17a సెక్షన్ పై సుప్రీం తీర్పుతో దేశ రాజకీయాల్లో మలుపు

చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెబుతూ ఏపీ సిఐడి కేసులు నమోదు చేసింది. అయితే ఏ ఆధారాలు లేకుండా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా..

Written By: Dharma, Updated On : October 9, 2023 12:37 pm
Follow us on

Chandrababu Case: చంద్రబాబు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఎన్నో సంచలనాలకు వేదిక కానుంది. దేశవ్యాప్తంగా అనేక కీలక పరిణామాలకు వేదిక అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా 17a సెక్షన్ పై విస్తృత చర్చ నడుస్తోంది. ప్రజా ప్రతినిధుల పాలసీపరమైన నిర్ణయాలపై..తదుపరి ప్రభుత్వం చేపడుతున్న కక్ష సాధింపులను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏసీబీ చట్టంలో 17 ఏ సెక్షన్ తీసుకొచ్చింది. ఈ సెక్షన్ అమల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపు కేసులకు బలం తగ్గిపోయింది. ఈ తరుణంలోనే చంద్రబాబు కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి మరి.

చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెబుతూ ఏపీ సిఐడి కేసులు నమోదు చేసింది. అయితే ఏ ఆధారాలు లేకుండా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా.. అప్పటికప్పుడు a37 గా చూపెడుతూ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. ఆయన అరెస్ట్ అయి దాదాపు 30 రోజులు అవుతోంది. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 17a సెక్షన్ అనుసరించి చంద్రబాబు కేసుల నుంచి తప్పకుండా బయటపడతారని ఆయన తరుపు న్యాయవాదులు బలంగా నమ్ముతున్నారు.

17 ఏ సెక్షన్ తో రాజకీయ కక్ష సాధింపులు కేసు నుంచి చాలామంది బయటపడ్డారు. రాఫెల్ లో భారీ స్థానం జరిగిందని కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించింది. విచారణ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వంప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది.ప్రభుత్వాలు మారినప్పుడు కక్ష సాధింపులు, అంతకుముందున్న ప్రభుత్వం నిర్వహించిన వారిపై వేధింపులు నియంత్రించేందుకు 17 సెక్షన్ ను తెచ్చింది. దీని ప్రకారం కేసులు పెట్టాలన్నా, దర్యాప్తు చేయాలన్నా.. రాష్ట్రాల్లో అయితే గవర్నర్, కేంద్రంలో అయితే రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి చేశారు. ఇప్పుడు చంద్రబాబు కేసు విషయంలో సైతంఅదే సెక్షన్ శ్రీరామరక్షగా నిలుస్తుందని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.

చంద్రబాబు కేసులో 17a సెక్షన్ వర్తించదని సిఐడి లాజిక్ పాయింట్ చెబుతోంది. ఈ సెక్షన్ వచ్చే నాటి ముందే.. చంద్రబాబుపై కేసు నమోదు, విచారణ ప్రారంభమైందని సిఐడి తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. అందుకే ఈ సెక్షన్ వర్తించదని చెబుతున్నారు.అయితే ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాతే విచారణ ప్రారంభమవుతుంది. మొన్నటికి మొన్నే ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. చంద్రబాబు పేరును చేర్చారు. కానీ విచారణ ఏనాడో ప్రారంభమైందని చెప్పి చంద్రబాబు క్వాష్ పిటిషన్ను కొట్టి వేయాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు వాదిస్తుండడం విశేషం. ఈ కేసులో చంద్రబాబు కొనుకూలంగా తీర్పు వస్తే.. రాజకీయ కక్ష సాధింపులకు చెక్ పడినట్టు అవుతుంది. లేకుంటే మాత్రం రాఫెల్ తో సహా కీలక కేసులు తిరగదోడేందుకు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.