https://oktelugu.com/

Pushpa Movie in Andhra: ఆంధ్రాలో పుష్ప చిత్రానికి భారీ దెబ్బ…!

Pushpa Movie in Andhra: అనుకున్నంతా జరిగింది. ఏపీ టికెట్స్ ధరలు పుష్ప చిత్రాన్ని ప్లాప్ వెంచర్ గా మార్చేశాయి. ఏపీలో దాదాపు అన్ని ఏరియాల్లో పుష్ప నష్టాలు మిగల్చడం ఖాయంగా కనిపిస్తుంది. మూవీ విడుదల తర్వాత మరింత దుర్భర పరిస్థితులు ఏర్పడగా పెట్టుబడి రాబట్టడం ఇక జరగని పనే అంటున్నారు. పుష్ప బయ్యర్ల పూర్తిగా అయోమయ స్థితిలోకి వెళ్లిపోయారు అల వైకుంఠపురం లో మూవీ ఇండస్ట్రీ హిట్ అందుకోగా అల్లు అర్జున్ పుష్ప పై భారీ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 24, 2021 / 01:02 PM IST
    Follow us on

    Pushpa Movie in Andhra: అనుకున్నంతా జరిగింది. ఏపీ టికెట్స్ ధరలు పుష్ప చిత్రాన్ని ప్లాప్ వెంచర్ గా మార్చేశాయి. ఏపీలో దాదాపు అన్ని ఏరియాల్లో పుష్ప నష్టాలు మిగల్చడం ఖాయంగా కనిపిస్తుంది. మూవీ విడుదల తర్వాత మరింత దుర్భర పరిస్థితులు ఏర్పడగా పెట్టుబడి రాబట్టడం ఇక జరగని పనే అంటున్నారు. పుష్ప బయ్యర్ల పూర్తిగా అయోమయ స్థితిలోకి వెళ్లిపోయారు

    Allu Arjun Pushpa Movie in Andhra

    అల వైకుంఠపురం లో మూవీ ఇండస్ట్రీ హిట్ అందుకోగా అల్లు అర్జున్ పుష్ప పై భారీ హైప్ ఏర్పడింది. కాంబినేషన్ అడ్వాంటేజ్ తో పాటు పాన్ ఇండియా చిత్రమనే బ్రాండ్ నేమ్ కారణంగా భారీగా బిజినెస్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప రూ. 102 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాం హక్కులు 36 కోట్లకు అమ్ముడు పోగా… 66 కోట్లకు ఆంధ్రా హక్కులు నిర్మాతలు విక్రయించారు. తెలంగాణలో సేఫ్ వెండర్ గా మిగిలిన పుష్ప.. ఆంధ్రాలో భారీ నష్టాలు దిశగా పయనిస్తోంది.

    పుష్ప విడుదలైన వారం గడుస్తున్నా ఆంధ్రాలో కేవలం సగం పెట్టుబడి మాత్రమే రాబట్టింది. కొత్త చిత్రాల విడుదలతో పాటు సినిమాపై ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో మిగతా యాభై శాతం పెట్టుబడి రాబట్టడం, బ్రేక్ ఈవెన్ కి చేరుకోవడం కలే అని చెప్పాలి. ఇక ఆంధ్రాలో ప్రమాణాలు పాటించని థియేటర్స్ ని అధికారులు సీజ్ చేస్తున్నారు. కొత్త చిత్రాల పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప బయ్యర్స్ సేవ్ కావడం జరగని పనే.

    Also Read: యూఎస్​లో డాలర్ల వర్షం కురిపిస్తోన్న పుష్పరాజ్​

    ఓవర్ సీస్, నైజాంలో పుష్ప సేఫ్.. హిందీ, తమిళ, కన్నడ భాషలతో పాటు ఆంధ్రాలో తెలుగు వర్షన్ కూడా నష్టాలు మిగల్చనుంది. పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా ప్రతికూల పరిస్థితులు, భారీగా హక్కులు అమ్మడం కారణంగా పుష్ప చిత్ర బయ్యర్లకు నష్టాలు ఎదురుకానున్నాయి. పుష్ప రన్ ముగిసే నాటికి ఏపీలో కనీసం 80-90 శాతం పెట్టుబడి రాబట్టినా కొంత మేర ఎగ్జిబిటర్లు కోలుకుంటారు. అయితే అది అంత సులువైన విషయం కాదు.

    ఆంధ్రాలో టికెట్స్ ధరలు ఇదే తీరున కొనసాగితే భవిష్యత్ లో తెరకెక్కనున్న భారీ చిత్రాలు తమ బడ్జెట్ విషయంలో పునరాలోచించాల్సిందే. తెలుగు సినిమాకు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని సినిమా బడ్జెట్, స్టార్స్ రెమ్యూనరేషన్స్ నిర్ణయించాల్సి ఉంటుంది.

    Also Read: తగ్గేదే లే అంటున్న క్రికెటర్ రవీంద్ర జడేజా

    Tags