https://oktelugu.com/

Somu Veeraju vs  ABN RK : సోము వీర్రాజుపై ఆంధ్రజ్యోతి అల్లిన తప్పుడు కథనం వెనుక ఉన్న ఉద్దేశం ఇదీ!

Somu Veeraju vs  ABN RK : మోడీ పర్యటనలో ఏదో జరిగిందని మీడియా అవాకులు చెవాకులు పేలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును మోడీ గుర్తు పట్టలేదని.. ‘మీరు ఎవరు? ఏం చేస్తారని’ అడిగారని మీడియాలో కథలు కథలుగా వార్తలు రాశారు. అభూత కల్పనలతో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగానే మోడీ గుర్తించలేదని రాసుకొచ్చారు. సోము వీర్రాజు వ్యతిరేక వర్గం మీడియాకు ఉప్పందించి మసాల దట్టించి ఆయనను అవమానించే ఎత్తుగడలు చేసింది. దీనిపై తాజాగా బీజేపీ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 15, 2022 2:28 pm
    Follow us on

    Somu Veeraju vs  ABN RK : మోడీ పర్యటనలో ఏదో జరిగిందని మీడియా అవాకులు చెవాకులు పేలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును మోడీ గుర్తు పట్టలేదని.. ‘మీరు ఎవరు? ఏం చేస్తారని’ అడిగారని మీడియాలో కథలు కథలుగా వార్తలు రాశారు. అభూత కల్పనలతో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగానే మోడీ గుర్తించలేదని రాసుకొచ్చారు. సోము వీర్రాజు వ్యతిరేక వర్గం మీడియాకు ఉప్పందించి మసాల దట్టించి ఆయనను అవమానించే ఎత్తుగడలు చేసింది. దీనిపై తాజాగా బీజేపీ సీనియర్ ఎంపీ జీవీఎల్ నరసింహరావు క్లారిటీ ఇచ్చారు.

    ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన విజయవంతం అయింది. బిజెపి అపూర్వ స్వాగతం పలికింది. వ్యక్తిగతంగా నా అభ్యర్థన మేరకే విశాఖలో సభ జరిగింది. అనేక ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు జరగటం రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇస్తున్న సహకారానికి నిదర్శనం. ప్రధాని పర్యటనలో రైల్వే జోన్ ఉంటుందా లేదా వంటి చర్చలు సాగాయి. ప్రధాని రాకకంటే ఒక రోజు ముందే ఈనెల 10న జోన్ నిర్ధారిస్తూ నోటిఫికేషన్ వెలువడింది. గత కాంగ్రెస్ చేతనంత అభివృద్ధి కేంద్రం చేస్తున్నారు. రాయగడ డివిజన్, సౌత్ కోస్ట్ జోన్లకు 106 కోట్లు మంజూరు చేశారు. కనుక దీని మీద విమర్శలు నిర్హేతుకం అని జీవీఎల్ అన్నారు.

    రైల్వే మంత్రి జోన్ ప్రధాన‌కార్యాలయం ఎక్కడ నిర్మించాలో మోడీ తనిఖీలు చేశారు. నిర్మాణ ప్రక్రియ త్వరలోనే మొదలవుతుంది. నేషనల్ ఇంటర్నెట్ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియా ఎనిమిది సెంటర్లలో ఒకటి విశాఖకు దక్కింది. ఇది నెట్ కల్పనకు ఇది అత్యవసరం. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవే ఈ శాఖా చూస్తున్నారు. మరో మూడు నెలల్లో ఇది విశాఖలో సాకారం అవుతుంది. ఐటి పరిశ్రమ అభివృద్ధికి ఇది ఊపునిస్తుందని జీవీఎల్ తెలిపారు. ఇంటర్నెట్ సేవలు ఫాస్ట్ ట్రాక్ లో అందుతాయి.

    ప్రధా‌ని పర్యటన సందర్భంగా బిజెపి కోర్ కమిటీతో గంటన్నర చర్చించారు. అదే రాత్రి ప్రెస్ మీట్లో ఆ వివరాలు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. కోర్ కమిటీ సమావేశంలో జరిగిన విషయాలు బయటకు చెప్పం. కానీ కొన్ని మీడియాలు అక్కడ ఏదేదో జరిగిందని కొందర్ని టార్గెట్ చేస్తూ అసత్యాలు రాశారని జీవీఎల్ తెలిపారు. సోము వీర్రాజు గారిని ‘మీ పేరేమిటి’ అని అడిగారని రాశారు. ఇది వీర్రాజును బలహీన పరచటానికి బురద చల్లటానికీ రాసిన రోత అని జీవీఎల్ మండిపడ్డారు. మోదీ వద్దకు వెళ్లిన వారు మొదట సంప్రదాయం ప్రకారం తమ పేర్లు హోదాలు చెప్తారు. అంతకు ముందు ఏయిర్ పోర్టులో సోము వీర్రాజుగారు స్వాగతం పలికి రోడ్ షోలో పాల్గొన్నారు కదా? అంతకు ముందు పవన్ కల్యాణ్ ను మోదీ వద్దకు తీసుకు వెళ్లింది సోము వీర్రాజుగారు కాదా? మీరు కోరుకున్న నాయకుడికి అనుకూలంగా మసలటం లేదనే కదా ఈ అసత్య రాతలు? ఎందుకు అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన పత్రికలో రాసిన రాతలపై జీవీఎల్ మండిపడ్డారు. మీకు సోము వీర్రాజు అంటే పడదు కనుక ఆయన‌మీద ఊహించుకుని రాసేస్తారా? మీకు ఆత్మ అనేది ఉంటే ఆత్మ విమర్శ చేసుకోండని ఏబీఎన్ ఆర్కేకు.. ఇది ప్రచారం చేసిన మీడియాకు జీవీఎల్ హితవు పలికారు.

    ‘సోముజీ మీరు ఏం చేస్తుంటారు’ అని మోదీజీ అడిగితే _42 ఏళ్లుగా పార్టీకి అంకితం అయ్యానని వీర్రాజుగారు చెప్పారు. నా మాదిరిగానేనా! అని మోదీ వ్యాఖ్యానించారు. ఇంత మంచి అభినందన‌ ఇక ఎవరికైనా లభిస్తుందా? అని జీవీఎల్ అక్కడ జరిగిన సంభాషణపై క్లారిటీ ఇచ్చారు. కోర్ కమిటీలో ఎవరూ ఆగ్రహంగా మాటాడలేదు. అది మా సంస్కృతి కాదు. చక్కని వాతావరణంలో కోర్ కమిటీ సభ్యుల్లో చాలా మంది తమకు వచ్చిన ఆలోచనలు పంచుకున్నారు. అక్కడ విమర్శలు చేయగలంత స్థాయి ఎవరికీ లేదు. కొత్త ఒరవడితో ప్రజలకు సేవలందటమే లక్ష్యంగా పని చేయాలని‌ ప్రధాని సూచించారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి దోహద పడేలా ప్రధాని యాత్ర సాగింది. మా శోభా యాత్ర మీద పోలీసులు అనేక ఆక్షలు విధించినా అది విజయవంతం అయిందని జీవీఎల్ తెలిపారు.