AP DGP Twitter account : ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు పెరుగుతున్నాయి. బాధ్యత గల వ్యక్తుల పేరు మీద నకిటీ ఖాతాలు సృష్టిస్తూ పక్కదారి పట్టిస్తున్నారు. దేశంలో ఇలాంటి మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో డీజీపీ పేరు మీద నకిలీ ట్విట్టర్ ఖాతా సృష్టించారు. అంతటితో ఆగకుండా అందులో బూతుబొమ్మలు పెడుతూ ఆయన పేరుకు మచ్చ తెస్తున్నారు. మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఇలా నకిలీ ఖాతాల బాగోతాలు వెలుగు చూడటం సంచలనం కలిగిస్తోంది. అది కూడా ఏకంగా పోలీస్ బాస్ అయిన డీజీపీ పేరు మీదే తీసుకురావం ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

దీనిపై పోలీస్ శాఖ ఉలిక్కిపడింది. చట్టానికి ప్రతినిధులుగా ఉన్న వారి మీదే నకిలీ ఖాతాలు తేవడం దేనికి సంకేతం? దీనికి పాల్పడింది ఎవరు? ఎందుకిలా చేస్తున్నారు? పోలీసులను అప్రదిష్ట పాలు చేస్తే ఎవరికి లాభం? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. వారి ఉద్దేశాలు ఏమిటి? డీజీపీపై ఏం సాధించాలని ఇలా చేస్తున్నారు? సంఘ విద్రోహక శక్తులా? ఉగ్రవాదులా? ఎవరై ఉంటారనే ఆలోచనలో పోలీసులు నిఘా పటిష్టం చేశారు. ట్విట్టర్ ఖాతా క్రియేట్ చేసిన వారి వివరాల కూపీ లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.
పోలీస్ టెక్నికల్ టీం రంగంలోకి దిగింది. వారెవరనే దానిపై విచారణ ముమ్మరం చేశారు. పోలీసులను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి దారుణానికి తెగించారా? వారి లక్ష్యం ఏమిటి? పోలీసు శాఖను అప్రదిష్ట పాలుకు గురి చేయడమే వారి ఉద్దేశంగా భావిస్తున్నారు. పోలీసుల దృష్టిని మరల్చేందుకు ఇలా చేశారని చెబుతున్నారు. 2020 ఫిబ్రవరిలోనే ఈ ట్విట్టర్ ఖాతా క్లోజ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇలా పోలీసులను నకిలీ ఖాతాలతో పక్కదారి పట్టించడమే కాకుండా వారిని బురిడీ కొట్టిస్తున్నారని సందేహాలు వస్తున్నాయి.
కావాలనే ఎవరో ఈ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసినట్లు గుర్తించారు. పోలీసుల పేరుతో నకిలీ ట్విట్టర్ అకౌంట్ తెరిచి అందులో అలా బొమ్మలు పెడుతూ వారికి చెడ్డ పేరు తీసుకురావడానికే ప్రాధాన్యం ఇచ్చారు. డీజీపీ పేరుతో అగంతకులు చేసే కుట్రలను భగ్నం చేయాల్సి ఉన్నా సాంకేతికత టీం ఏం చేస్తుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అనే కామెంట్లు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. భవిష్యత్ లో కూడా ఇలాంటి వాటిని రాకుండా చేసేందుకు పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో తెలియడం లేదు. డీజీపీ పేరు మీదే నకిలీ ఖాతా సృష్టించినా ఎందుకు గుర్తించలేదు అనే వాదనలు కూడా వస్తున్నాయి.