CM Jagan Birthday సాధారణంగా పుట్టినరోజు అంటే ఐదు కిలోల కేకును ఏర్పాటు చేస్తుంటారు. 10 కిలోలు దాటితే గొప్పగా చూస్తారు. 100 కిలోలు దాటితే విశేషంగా చెబుతారు. కానీ ఏకంగా 600 కిలోల కేకును ఏర్పాటుచేసి అబ్బురపరిచారు. ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అభిమాన నాయకుడి పుట్టినరోజు వేడుకలను నేతలు,కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. బర్త్ డే కేకులు కట్ చేసి కార్యకర్తలకు పంచి పెడుతున్నారు.సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.అయితే విజయవాడలో వినూత్నంగా వేడుకలు జరపడం విశేషం. భారీ కేక్ విజయవాడ పురవీధుల్లో ఊరేగించి కట్ చేయడం విశేషం.
గత కొన్నేళ్లుగా జగన్ జన్మదిన వేడుకలు అంటే విజయవాడలోని గొల్లపూడి లో అంబరమే. గత ఏడాది 600 కిలోల కేక్ తో అభిమానులు సందడి చేశారు. ఎమ్మెల్సీ తలశీల రఘురాం, మంత్రి మెరుగ నాగార్జున ఆధ్వర్యంలో వేడుకలు అంబరాన్ని తాకాయి. ఏకంగా 600 కిలోల కేకును రూపొందించి ఓ కంటైనర్ లో నగర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దానిని కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది.
అయితే ఈ ఏడాది ముందస్తుగానే జగన్ జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయి. గత ఏడాది మూడు రోజులు పాటు అధికారికంగా నిర్వహించారు. ఈ ఏడాది సైతం అదే ఆనవాయితీని కొనసాగించారు. సాధారణంగా ఐదు నుంచి పది కిలోల వరకు జన్మదిన కేకును ఎవరైనా రూపొందిస్తారు. అయితే వైసీపీ నేతలు కాస్త భిన్నంగా ఆలోచించారు. జగన్ జన్మదిన వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేషన్ చేయాలనుకున్నారు. అందుకే భారీ స్థాయి కేకుతో మీడియాను సైతం ఆకర్షించారు. ఇప్పుడు ఈరోజు ఇదే ఆసక్తికరమైన వార్తగా నిలుస్తోంది. వైసీపీ శ్రేణులను తెగ ఆకట్టుకుంటుంది. అయితే 600 కిలోల కేకు దాదాపు పదివేల మందికి పంచి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే వేడుకలకు వచ్చే కార్యకర్తలు కేకు తినేందుకు పోటీపడ్డారు కానీ.. అంత భారీ స్థాయిలో ఉన్న కేకును తినాలంటే కాస్త ఇబ్బందికరమే. దీంతో ఆ కేకును నగర ప్రజలకు పెంచాల్సి వచ్చింది.