https://oktelugu.com/

వైసీపీలోకి ఐదుగురు టీడీపీ ఎమ్మెల్సీలు జంప్?

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శాసన మండలి ఇప్పట్లో రద్దయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే శాసన సభ మండలిని రద్దు చేయాలని కోరుతూ శాసనసభ చేసిన తీర్మానాన్ని కేంద్ర పరిశీలించి పార్లమెంట్ సమావేశాల్లో అందుకు సంబంధించిన బిల్లును సిద్ధం చేసి లోక్ సభలో ఆమోదించిన అనంతరం రాజ్య సభలో ఆమోదిస్తే గాని మండలి రద్దయ్యే అవకాశం లేదు. కరోనా వైరస్ తో సమస్యలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లుకు అంత ప్రాధాన్యత […]

Written By: , Updated On : June 25, 2020 / 05:21 PM IST
Follow us on


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శాసన మండలి ఇప్పట్లో రద్దయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే శాసన సభ మండలిని రద్దు చేయాలని కోరుతూ శాసనసభ చేసిన తీర్మానాన్ని కేంద్ర పరిశీలించి పార్లమెంట్ సమావేశాల్లో అందుకు సంబంధించిన బిల్లును సిద్ధం చేసి లోక్ సభలో ఆమోదించిన అనంతరం రాజ్య సభలో ఆమోదిస్తే గాని మండలి రద్దయ్యే అవకాశం లేదు. కరోనా వైరస్ తో సమస్యలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లుకు అంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.

విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిందెవరు?

మరోవైపు మండలిలో టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తన పదవికి రాజీనామా చేసి కొద్ది రోజుల కిందట వైసీపీలో చేరారు. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. మండలి రద్దు నిర్ణయంతో తొలుత వైసీపీ ఆ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉండదని అందరూ భావించారు. నామినేషన్ దాఖలుకు చివరి రోజు వైసీపీ అభ్యర్థిగా డొక్కాను ప్రకటిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీల్లో కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి.

వైసీపీకి షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చిన ఎంపీ..!

ఇదే ఆఫర్ తమకు ఇస్తే పార్టీ మారేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు ఐదుగురు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. అధికార పార్టీ అంగీకరిస్తే టీడీపీ నుంచి జంప్ చేసేస్తామంటూ వారి అభిప్రాయాన్ని వైసీపీలోని ఓ ముఖ్య నేతను కలిసి వీరంతా వెలిబుచ్చినట్లు తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే బాటలో అధికార పార్టీలోకి మరికొందరు టీడీపీ ఎమ్మెల్సీలు వెళ్లే అవకాశం లేకపోలేదని సమాచారం. పవర్ పాలిటిక్స్ కాబట్టి తప్పులేదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికిప్పుడు మండలి రద్దయ్యే అవకాశాలు లేకపోవడంతో మండలిలో తమ బలం పెంచుకునేందుకు చర్యలు తీసుకోక వైసీపీకి మరో మార్గం లేదు. శాసన సభలో వైసీపీకి 151 సీట్లు ఉన్నా మండలిలో సరైన బలం లేకపోవడంతో తమకు అవసరమైన బిల్లులు ఆమోదించుకుని చట్టాల రూపంలో తెచ్చుకునే పరిస్థితి అధికార పక్షానికి లేదు. కాబట్టి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్సీలను రాజీనామా చేసిన అనంతరం ఆ సీటు వారికే ఇచ్చే ఒప్పందంతో పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.